Daily news papers viewing web view / website

Daily news papers viewing web view / website

Daily news papers viewing web view / website వార్తలు అంటూ విశేషాలు పుకార్లను లేనిపోని కబుర్లను చెబుతూ ఉండడం మాములుగా రచ్చబండలాంటి చోటుల్లో లేక కొన్ని చాయ్ దుకాణాల దగ్గర చెప్పుకుంటూ మాటలు సాగుతూ ఉంటాయి. సరదాగా సాగే మాటలలో కొన్నిసార్లు వార్తల్లో విశేషాలు ఉంటే, విశేషం లేనప్పుడు స్నేహితుడు చెప్పిన చలోక్తో, ఎవరైనా పుకార్లను వ్యాప్తి చేసే గుణం ఉంటే వారి ద్వారా ఆ గ్రూపు చెవిలో చేరినా విషయమో, సినిమా చిత్రాలో నటిమణుల విచిత్ర వేషధారణ గురించో ఉంటూ ఉంటాయి.

సహజంగా సాగే ఈమాటలు చెప్పుకునే యువత కానీ పెద్దవారు కాని పిల్లలు వస్తే వద్దు ఇక్కడ నుండి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి అంటూ హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే సంఘపరంగా మాట్లాడుకునే మాటలలో మంచి చెడు కలిసి ఉంటాయి. మనల్ని అనుసరించే వారికి మననోటా నుండి చెడు స్వాభావిక అర్ధాలు వచ్చే మాటలు చేరకూడదనే సద్భావన ఉంటుంది. అలా సంఘటిత వాతావరణంలో మంచైనా చెడైనా మాటలలో నానుతూ సాగుతూ ఉంటుంది. వ్యక్తి వ్యక్తుల ప్రత్యక్ష సంవాదాన ఉంటుంది కాబట్టి అనుసరించేవారు రాకుండా ఉంటారు.

దూరదర్శన్ ఛానల్లో వచ్చే వార్తలు రోజు ఒక అరగంట చూసి గంట మాట్లాడుకునే రోజుల్లో మంచి చెడులపై మాటల ప్రవాహం రచ్చబండలపై లేక చాయ్ దుకాణాలపై సాగితే, సమూహానికి సమాచార వ్యవస్థ ద్వారా ఒక పద్దతిలో వార్తలు అందేవి. ఇప్పుడు అయితే అన్ని టివి ఛానల్లలో ఎన్నెన్నో వార్తలు ఎవరెవరో వచ్చి డిబేట్లు చేస్తూ ప్రజలకి న్యూస్ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇలాంటి న్యూస్ చూడాలంటే తప్పనిసరిగా టివి లేక స్మార్ట్ ఫోన్లో లైవ్ చూపించే మొబైల్ ఆప్స్ చుస్తే సరిపోతుంది. కంప్యూటర్ ద్వారా నెట్లో కూడా లైవ్ టివి కార్యక్రమాలు చూడవచ్చు.

Reading Hobby Demanding Daily Reading

పత్రికలు ఉన్నా టివి చానల్స్ చాలానే వచ్చాయి. అన్ని చానల్స్ వచ్చిన దినపత్రికలు చదివే వారు ఎక్కువగానే ఉంటారు. టివి చూస్తే వారు చూపించినది, చూస్తాం ఒక సినిమాలాగో లేక సీరియల్లాగానో. అక్షరజ్ఞానం లేనివారికి రేడియోలో వార్తలు వింటూ ఉండేవారు, టివిలు వచ్చాక టివిలో వార్తలు చూడడం పరిపాటి. కానీ అక్షరజ్ఞానం ఉన్నవారు మాత్రం పత్రికలను చదవడానికి ఇష్టపడతారు.

తినేవాడికి తెలిసిన రుచి చూసేవాడికి ఏమి తెలుస్తుంది. రుచికి అలవాటు పడిన నాలుక రుచిని ఎలా విడిచిపెడుతుంది. మాటలు మాట్లాడేవారు వినే ఉన్నంతవరకు మాటలాడుతూనే ఉంటారు. వారికి మాటలాడడం అలవాటు, వినేవారు వింటూ ఉంటారు వారికి వినడం అలవాటు, అలాగే చదివేవారు చదువుతూ ఉంటారు, చదవడం అలవాటు. అలా చదువుతూ ఉండే వారికి దినపత్రిక చదవడం అలవాటు ఉంటే మాత్రం ఉదయానే దినపత్రిక రాకపోతే దినం గడుస్తున్నట్టుగా అనిపించదంటారు.

దినపత్రికలో వార్తలను నెట్లో చదివే అవకాశం ఎప్పటినుండో ఇంటర్నెట్ ద్వారా ప్రముఖ దినపత్రిక సంస్థలు తమ తమ వెబ్ సైట్ల ద్వారా అందిస్తున్నాయి. అలా వెబ్ సైట్లో వార్తలను అందించే వెబ్ సైట్ల వివరాలలోకి వెళితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, జీన్యూస్ మొదలైన దినపత్రిక వెబ్ సైట్లు ఉంటాయి. Daily news papers viewing web view / website అలాగే కొన్ని వెబ్ సైట్లలో అయితే అన్ని దినపత్రికల వార్తలను పత్రికల వారిగా వారి వెబ్ సైట్లలో ఉంచుతారు.

Some Daily News Paper Websites

Daily news paper viewing web view / website ఈనాడు ఇపేపర్ అయితే అచ్చం దినపత్రికనే ఇపేపరుగా నెట్ ద్వారా చదవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈనాడుఇపేపర్ వెబ్ సైట్ దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. వెబ్ వార్తలుగా చదవాలంటే eenadu.net వెబ్ సైట్లో సాదారణ వెబ్ ఆధారిత కంటెంట్ టైపులో కనిపిస్తుంది. eenadu.net వెబ్ సైట్ దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Andhra Jyoti daily news paper viewing web view / website ఈనాడు తరహాలో ఆంధ్రజ్యోతికి కూడా ఇ పేపర్ సదుపాయం ఉంది, మామూలు దినపత్రికను వెబ్ సైట్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. అలాగే ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ తరహాలో న్యూస్ మరియు వీడియోలు వీక్షించడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Sakshi daily news paper viewing web view / webiste సాక్షి పేపర్ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తరహాలో ఇపేపర్ మరియు వెబ్ సైట్ తరహాలో వెబ్ న్యూస్ పేపర్  ఉన్నాయి. ఇపేపర్ కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. సాక్షికోసం ఇక్కడ ఇవే అక్షరాలపై ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. అలాగే మీరు ప్రజాశక్తి పేపరుకి అభిమానా ప్రజాశక్తి వెబ్ సైట్ తరహా న్యూస్ కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రజాశక్తి, నమస్తే తెలంగాణా తదితర వెబ్ సైట్లు కలవు. ఆంధ్ర ప్రభ ఇపేపర్ కోసం ఏఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అన్ని తెలుగు దినపత్రికలలో వార్తలను పత్రికల వారిగా వెబ్ సైట్లో అందించే డైలీ హంట్ మొబైల్ వెబ్ సైట్ కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

సమయంలో సమయానికి సినిమా వార్తలను, సామజిక వార్తలను, విషయాల వివరాలను తెలుపుతూ ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా ఉండే వెబ్ సైట్ కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

జీన్యూస్ తెలుగులో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. జీ సంస్థ వారి వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

డైలీ హంట్ మాదిరి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణా, నవ తెలంగాణా, ఆంధ్రభూమి, ప్రజాశక్తి, సూర్య, వార్త, ఆంధ్రప్రభ మొదలైన తెలుగు పేపర్లని ఒక చోటే చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. సదరు వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

ఇవికాకా ఇంకా న్యూస్ పేపర్స్ మరియు న్యూస్ అప్డేట్ చేసే వెబ్ సైట్లు మనకి ఆన్ లైన్లో అనేకంగా ఉంటాయి. గూగుల్ తెలుగు న్యూస్ పేపర్ అని టైపు చేసే ఇంకా ఇతర web views కూడా వస్తాయి.

ధన్యవాదాలు
vegawebviews

vegawebviews – Blog Carrying Knowledge Things

vegawebviews – Blog Carrying Knowledge Things

vegawebviews – Blog carrying knowledge things online బ్లాగు అనేక విషయాలను గూర్చి వివరణ లేక విషయాలను తెలియజేసే వివరాల సమాహారం లేక ప్రభావంతమైన విషయాలపై వివరణ ఇచ్చే విశ్లేషణల విజ్ఞాన ఇంటర్నెట్ వెబ్ పేజి.

మన పుస్తకంలో వైట్ పేపర్లో వ్రాస్తే అది మనదగ్గరే ఉండి, మనం ఎప్పుడైనా ఎవరికైనా చూపితే లేక మనం లేనప్పుడు ఎవరైనా మనం రాసిన పుస్తకంలో ఆ పేపర్ పేజి చదివితే వారికి తెలుస్తుంది. ఒకసారి ఒకరికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్నెట్ ఆధారిత వెబ్ పేజిలో ఏదైనా విషయంపై వివరణ వ్రాస్తే ఒకేసారి అనేకమంది చదవగలుగుతారు. web views ఎక్కువగా ఉండే వెబ్ సైట్లలో ఈ విషయాలు మరీ వేగంగా వెళతాయి.

కొన్నిబ్లాగులు సామజిక అంశాలపై విశ్లేషణలు అందిస్తే, మరి కొన్ని బ్లాగులు అధునాతన అంశాలపై అప్డేట్స్ అందిస్తూ ఉంటాయి. కొన్ని బ్లాగులు చదువుకు సంభందించిన విషయాల్లో సందేహాలు, సమస్యలు, సమాధానాలు అందిస్తూ ఉంటాయి. ఇతర బ్లాగులు ఎంటర్ టైన్ విషయాలలో వార్తలను వివరిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా బ్లాగుల వలన కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. కొన్ని సబ్జెక్టు పరమైన సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. అంటే బ్లాగుల ద్వారా విజ్ఞాన ప్రవాహం జరుగుతూ ఉంటుంది.

Blog Carrying More Things of Knowledge

అనేకానేక ఆన్ లైన్ విషయాలు ఉంటే, వాటిని తెలియపరిచే అనేకానేక బ్లాగులు మనకి ఆన్ లైన్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజర్ సహాయంతో చూడవచ్చు. సాంకేతిక విషయాలు (Technology Web Things), సినిమా విషయాలు (Movie Things/Views), ఆరోగ్య విషయాలు (Health Things), వ్యక్తిగత విషయాలు (Personal Things), సామజిక విషయాలు (Social Things), రాజకీయ విషయాలు (Political Things), మొబైల్ ఆప్స్ (Mobile Applications), అలవాటు విషయాలు (Habituated Things) ఇంకా అనేకానేక విషయాలు (so many things) బ్లాగుల ద్వారా తెలుసుకోవచ్చు అని అంటారు.

సెర్చ్ ఇంజిన్ ద్వారా కావాల్సిన విషయంపై ఆన్ లైన్లో వెతికి పట్టుకోవచ్చు. అలా అనేక విషయాలు గూగుల్ సెర్చ్ ఇంజిన్, బింగ్ సెర్చ్ ఇంజిన్, యాహు సెర్చ్ ఇంజిన్, యండేక్ష్ సెర్చ్ ఇంజిన్ మొదలైన వాటిలో విషయాలను వెతికి బ్రౌజర్ ద్వారా వీక్షించవచ్చు(Viewing With Web).

వంద పుస్తకాలు పూర్తిగా చదివి ఒక కొత్త పుస్తకం వ్రాయగలిగినట్లు, వంద బ్లాగుల విషయ వివరాలు పరీక్షగా చదవడం వలన మరియు టెక్నికల్ స్కిల్ల్స్ పెంచుకుంటే మరొక ఉపయుక్తమైన కొత్త బ్లాగు సృష్టించవచ్చు. అయితే బ్లాగుని సృష్టించడం కోసం కొంచెం కంప్యూటర్ వాడకం తెలిసి ఉండాలి, అలాగే బ్రౌజింగ్ జ్ఞానం కలిగి ఉండాలి.

Anything viewing in web views- Blogs Carrying Things

ఒకప్పుడు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే, ఔత్సాహికులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని వారి వారి స్వీయ రచనలలో కానీ మాటలలో కానీ చెబుతూ ఉంటారు. కాని ఇప్పుడు టెక్నాలజీ మరియు ఆన్ లైన్ పరికరాలతో ఔత్సాహికులకు నేర్చుకోవడం సులభం అంటారు.

ఇంతకముందుకొత్తగా విడుదల అయిన సినిమా ఎలా ఉందొ తెలియాలంటే ఆ సినిమా చూసిన వారు వచ్చి చెప్పేదాకా సదరు సినిమా ఎలా ఉంది అనేది తెలిసే అవకాశం ఉండేది కాదు, కానీ ఇప్పుడు సినిమా విడుదల అయిన కొంచెం సేపటికే వివరాలు తెలుస్తున్నాయి. కొన్ని బ్లాగులలో విడుదల ముందే ఊహాత్మక వివరణలతో వెబ్ పేజి దర్శనం అవుతుంది (Viewing Web Page).

గత కాలంలో కొత్తవస్తువు గురించి తెలియాలంటే మనకి తెలిసినవారు ఆ వస్తువుని ఉపయోగించి ఉంటే మనకి తెలిసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ తెచ్చింది తేలికగా తెలుసుకునే సదుపాయాలు. కంప్యూటర్ ఉంటే బ్రౌజర్లో వెతకడం, స్మార్ట్ ఫోను ఉంటే మొబైల్ ఆప్ బ్రౌజర్లో వెతకడం చాలా సులభం అయ్యింది.

కొంతకాలం వెనుక పనికి కార్యాలయానికి వెళ్లి పనిచేయాలి కానీ ఇప్పుడు కొన్ని పనులలో ఇంటిదగ్గర నుండే ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, సర్వీస్ అందించవచ్చు. ఫ్రీలాన్సర్ గా ఉద్యోగం చేయవచ్చు, ఇకామర్స్ వెబ్ సైట్ ద్వారా ఉత్పత్తులు అమ్మకాలు చేయవచ్చు, వెబ్ డిజైన్, ట్యుటోరియల్, టీచింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి మొదలైన సర్వీసులు అందించవచ్చు.

ఎక్కువ నైపుణ్యం కలిగి తగినంత జీతం రాకపోయినా ఒకరి దగ్గర ఎక్కువకాలం పని చేసే రోజులలో కొంతమంది ఉండేవారని వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు నైపుణ్యత, పనితీరు, ప్రవర్తన, పనికాలం మొదలైన విషయాలు అర్హతా పత్రాలతో ఆన్ లైన్ వెబ్ సైట్లలో పెడితే, నైపుణ్యానికి తగినంత జీతం ఇచ్చే సంస్థలు కూడా సదరు సంస్థ అవసరాల కోసం ఆన్ లైన్లో నిపుణుల కోసం వెతికే స్థితి ఉంది అని అంటారు.

Blog Making Things  For EarnMoneyFromHome

సంశయం లేకుండా నిశ్చయంతో ఉపయుక్తమైన అంశంతో అర్ధవంతమైన వ్యాస రచన చేయగలిగిన వారు బ్లాగ్గింగ్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది అంటారు. ఏదైనా ఒక విషయంపై స్పష్టమైన వివరణతో ఎప్పుడు సదరు విషయంపై కావాల్సిన సమాచారంతో వ్యాసాలు వ్రాయగలగితే వ్రాసినవారికి ఉపయోగం ఉంటుంది అంటారు.

అలాగే ఏదైనా ఒక అంశంలో వస్తువులపై అవగాహనా కల్పించడం, వస్తువు వాడుకపై వివరణ ఇవ్వగలగడం, వస్తువు యొక్క ఉపయోగాలు చెప్పగలగడం, రాబోయే వస్తువులపై సమాచారం అందించడం కూడా బ్లాగ్గింగ్ చేయడానికి ఉపయుక్తమైన విషయంగా చెప్పబడుతున్నది, బ్లాగ్గింగ్ చేయడానికి.

ఇంకా ఒక ఈవెంట్ / అట లపై సమాచారం అందిస్తూ, సదరు ఈవెంట్ కర్తలు గురించి, లేక పాల్గొనే సభ్యుల గురించి వివరాలు అందిస్తూ, విశేషాలు తెలియజేస్తూ ఉండడం. ఎక్కడైనా అట జరుగుతుంటే ఆ ఆటకి సంభందించిన వివరాలు, అట మైదానం వివరాలు, ఆటగాళ్ళ వివరాలు, వారి అభిరుచులు ఇది కూడా ఒక రకమైన ఉపయుక్తమైన విషయంగా చెప్పబడుతున్నది, బ్లాగ్గింగ్ చేయడానికి.

సెలబ్రిటీలపై వచ్చే వార్త విశేషాలు, వారి బయోగ్రఫీ వివరించడం, సినిమా వార్తలు, సినిమా రివ్యూలు, టీవీ ప్రోగ్రామ్స్ వివరణలు వాటిపై రోజువారి అప్డేట్ బ్లాగ్గింగ్ బెటర్ ఛాయస్ ఫర్ మేకింగ్ మనీ (Daily Updated Blogging Better Choice For Making Money).

ఇంకా వివిధ బ్లాగు తయారుచేసే విషయాలు గమనిస్తే: ఆరోగ్య సమస్యలపై వివరణలు, హోం రెమెడీస్, బరువు తగ్గడం, టెక్నాలజీ విషయాలపై న్యూస్, అప్డేట్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సామజిక అంశాలు ఇవి కూడా ఉపయుక్తములైతే వాటిలో ప్రావిణ్యం ఉన్నవారికి సులభం.

ఉచిత బ్లాగు ఎలా సృష్టించాలి చదవడానికి ఇక్కడ తాకండి లేదా నన్ను నొక్కండి.

ధన్యవాదాలు
vegawebviews

Available WordPress / Web Hosting / Domain Services

Available WordPress / Web Hosting / Domain Services

బ్లాగ్గింగ్ సొంత హోస్టింగ్ ప్లానుతో మనకి నచ్చిన డొమైన్ పేరుతొ చేయడం

ఉచిత బ్లాగ్ సర్వీసులలో పరిమితులు ఉంటాయి, లేక మన బ్లాగు పేరుకు బ్లాగ్గింగ్ ప్రొవైడర్ పేరు కూడా జత చేయబడి ఉంటుంది. ఉదా: wordpress లో మీరు ఉచిత బ్లాగ్ create చేస్తే మీ బ్లాగు డొమైన్ అడ్రస్ ఇలా ఉంటుంది. ‘yourblogname.wordpress.com’, దీనిని సబ్ డొమైన్ అంటారు. డొమైన్ నేమ్ అంటే కేవలం మీరు ఎంచుకున్న పేరే మీ బ్లాగు అడ్రస్ గా ఉంటుంది. ప్రతి డొమైన్ అడ్రస్ ఒక ఎక్స్టెన్షన్ ఎండ్ అవుతుంది. అవి .com, .in, .net, .org, .blog, .website .co మొదలైన అనేక ఎక్స్టెన్షన్లు ఆన్ లైన్లో లభిస్తాయి. అయితే అందరు ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా వాడేది .com ఎక్స్టెన్షన్. .in అనేది దేశ పేరు అనుసరించి India లో in ఎక్స్టెన్షన్ గా వాడుతారు. అలాగే ఇతర దేశాలకు అయితే అమెరికా అయితే .us లాగా ఉంటయి. అలాగే కొన్ని సంస్థలు లేక వ్యవస్థలు వెబ్ సైట్లు ఎక్కువగా .net లేక .org ఎక్స్టెన్షన్లు ఉపయోగిస్తారు. ఏదైనా డొమైన్ పేరు మాత్రం అక్షరాలన్నీ కలిపే వ్రాయబడతాయి.

ఉచిత బ్లాగ్గింగ్ మాత్రమే కంటిన్యూ చేస్తూ, బ్లాగ్ పేరు మాత్రం, సొంతంగా డిజైన్ చేసిన పేరునే డొమైన్ నేమ్ గా వాడాలంటే, కేవల డొమైన్ కొనుగోలు చేసి, బ్లాగ్గింగ్ ప్లాట్ ఫారం ప్రొవైడర్ సెట్టింగ్స్ లో డొమైన్ చేర్చాలి. ఉచిత బ్లాగ్గింగ్ అంటే ఎక్కువగా గూగుల్ బ్లాగర్ ఉపయోగిస్తూ ఉంటారు. సులభంగా పోస్టులు చేయవచ్చు, గూగుల్ సెక్యూరిటీ ఉంటుంది అని అంటారు.

గూగుల్ బ్లాగర్ ఉపయోగిస్తే, డొమైన్ కొనుగోలు గూగుల్ ఎకౌంటు నుండి కొనుగోలు చేయవచ్చు లేదా గోడాడీ వెబ్ సైట్ నుండి డొమైన్ కొనుగోలు చేయవచ్చు. గూగుల్ ఎకౌంటు నుండి కొనుగోలు చేస్తే మీరు సెట్టింగ్స్ ప్రత్యేకంగా మార్పులు చేయనవసరం లేదు, కానీ ఇతర వెబ్సైటు గోడాడీ లాంటి వెబ్ సైట్లో డొమైన్ కొనుగోలు చేస్తే మీరు డొమైన్ సెటప్ గూగుల్ వారి సూచనలు అనుసరించి మార్పులు చేసుకోవాలి.

హోస్టింగ్ అంటే సర్వర్ స్పేస్ అద్దెకు తీసుకోవడం, నెలవారీ అద్దెకు సర్వర్లో కొంత స్పేస్ అమ్మకం చేసే వారిని హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. Cpanel సహాయంతో వెబ్ సైట్ కంట్రోలింగ్ చేయవచ్చు. ఇక హోస్టింగ్ పధకాలు వివిధ ధరలలో సదుపాయాల ఆధారంగా లభిస్తాయి. సొంతంగా మేనేజ్ చేసుకునే వారికీ వెబ్ టెక్నాలజీ తెలిసి ఉన్నా లేక తెలిసిన వారితో చేయించుకోవడం చేయాలి. బ్లాగర్ హోస్టింగ్ తీసుకోవడం అంటే ముందుగా సర్వర్లో మీ బ్లాగు పేరు మీద కొంత పరిమిత స్పేస్ కొనుగోలు చేయడం.

హోస్టింగ్ ఎకౌంటు కొనుగోలు చేసేటప్పుడు, సదరు హోస్టింగ్ ప్రొవైడర్స్ పై రివ్యూ రేటింగ్ వెబ్ సైటులు ఉంటాయి, అలాగే వాటి సేవలు మరియు పనితీరు పైన కొంతమంది వినియోగదారుల అభిప్రాయాలు షేర్ చేసే వెబ్ సైట్లు లేక బ్లాగులు ఉంటాయి. అవి చూస్తే హోస్టింగ్ ప్లాన్స్ మరియు వాటి సదుపాయాలు గురించి సరి అయిన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయంగా సేవలు అందించే సంస్థలలో హోస్ట్ గేటర్, డ్రీం హోస్ట్, బ్లూ హోస్టింగ్, ఇన్ మోషన్ హోస్టింగ్, ఏ2హోస్టింగ్, గోడాడీ తదితర వెబ్ హోస్టింగ్ కంపెనీ కలవు. మనకి ప్రాంతీయంగా అయితే లేబిల్ హోస్టింగ్ అందుబాటులో హైదరాబాద్లో ఉంది. సదరు వెబ్ సైట్ల లింకులు దిగువగా ఇవ్వబడ్డాయి, లింకుపై క్లిక్ చేసి సదరు వెబ్ సైట్ దర్శించవచ్చు.

హోస్ట్ గేటార్ HOSTGATOR
డ్రీం హోస్ట్ DREAM HOST
A2హోస్టింగ్ A2HOSTING
బ్లూ హోస్టింగ్ BLUE HOSTING
ఇన్ మోషన్ హోస్టింగ్ INMOTION HOSTING
లేబెల్ హోస్టింగ్ LABEL HOSTING

అలాగే హోస్టింగ్ పధకాలలో మొదటి చెల్లింపులో డొమైన్ నేమ్ ఉచితంగా అందించే పధకాలు ఉంటాయి, అయితే ప్రాధమిక పధకాలలో మాత్రం డొమైన్ నేముపై ప్రత్యేక రుసుం ఉంటుంది. ఒకటే వెబ్ సైట్ లేదా బ్లాగు మాత్రమే చేసేవారికి ప్రాధమిక పధకం సరిపోతుంది.

ఇచ్చిక పేరుపై డొమైన్ ఉంది లేనిది ఆన్ లైన్లో చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన పేరుతో ఇంతకుముందు ఎవరు డొమైన్ రిజిస్టర్ చేయకుండా ఉంటే, మీ ఐచ్చిక పేరుకు.com ఎక్ష్తెన్సన్ తో వివిధ డొమైన్లు చూపుతుంది. ఒకవేళ మీ ఐచ్చిక పేరుతో ఎవరైనా రిజిస్టర్ చేసుకుని ఉంటే మాత్రం మీరు ఇతర ఎక్ష్తెన్సన్ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఎక్కువగా .com ఎక్ష్తెన్సన్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. కొన్ని ప్రీమియం డొమైన్లు అమ్మకానికి ఉంటాయి, ఒకవేళ మీ ఐచ్చిక పేరు సదరు ప్రీమియం డొమైన్ల లిస్టులో ఉంటే, మీకు అదేపేరుతో డొమైన్ కావాలంటే మాత్రం మీరు సాదారణ ధర కన్నా ఎక్కువ ధరతో సదరు రిజిస్టర్ చేసుకున్న సంస్థ లేదా వ్యక్తికీ చెల్లించి కొనుగోలు చేయాలి.

ఎక్కువగా పాపులర్ లేక వాడుకలో ఉండే పదాలను కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని సంస్థలు కానీ ముందుగా డొమైన్ వారి పేరుపై డొమైన్ రిసెల్లర్ పధకంలో రిజిస్టర్ చేసుకుని, అవసరమైన వారికీ సాదారణ ధర కన్నా ఎక్కువ ధరలో అమ్మకాలు చేస్తూ ఉంటారు. సాదారణంగా ధర ఆ పేరుయొక్క డిమాండుని బట్టి నిర్ణయిస్తారు. అలా ఎక్కువగా వాడుకలో ఉండే పదాలు ప్రీమియం డొమైన్లుగా రూపాంతరం చెందుతాయి. పైన ఇవ్వబడిన హోస్టింగ్ ప్రొవైడర్ వెబ్ సైట్లలో కూడా మీరు డొమైన్ చెక్ చేసుకుని హోస్టింగ్ ప్లాన్ మరియు డొమైన్ కొనుగోలు చేయవచ్చు.

ధన్యవాదాలు
vegawebviews