Blog Views

Blog Views: Blog Making Things Practice Earning online Money

బ్లాగ్గింగ్ వలన యూట్యూబ్ వీడియో ఛానల్ వలన ఆన్ లైన్లో డబ్బు సంపాదన అవకాశాలు ఎక్కువ

Blog Views: Blog Making Things Practice Earning online Money ఇంతకుముందు పేజిలో ఇంటినుండే ఇంటర్నెట్ ద్వారా సంపాదన విషయాలలో ఫ్రీలాన్సర్ పై గల ఆన్ లైన్లో అవకాశాలు వ్రాయటం జరిగింది. అలాగే బ్లాగ్గింగ్ మరియు యూట్యూబ్ ఛానల్ వలన కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువ అంటారు. ఫ్రీ లాన్సర్ గా అయితే ఏదో ఒక ప్రత్యేకతలో నిపుణత అవసరం అని అంటారు. కానీ బ్లాగ్గింగ్ అయితే మాత్రం సాదారణ విషయలపై సరి అయిన అవగాహన ఉండి, ఇంటర్నెట్ బ్రౌజింగ్లో అనుభవం ఉంటే, ఏదైనా ఒక అంశంపై విషయాలు వివరణలు పోస్ట్ చేయడం మరియు అదే విషయంపై వీడియో వివరణ కూడా యూట్యూబ్ ఛానల్లో అప్ లోడ్ చేయడం ద్వారా ఇంటి నుండే ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్లో పనిచేసి డబ్బు సంపాదనా చేయవచ్చు. బ్లాగుని మొబైల్ వ్యూలో కూడా సరిగా ఉన్దేల్ చూసుకోవాలి, ఎందుకంటే కంప్యూటర్ వాడకం కన్నా స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువ కనుక, మొబైల్ వ్యూలో గాని, మొబైల్ అప్ లో గాని మనం చెప్పే విషయం ఉంటే, తొందరగా ఎక్కువమందికి చేరే అవకాశం ఉంటుంది.

బ్లాగు ద్వారా ఇంటినుండే డబ్బు సంపాదించాలంటే, ఎటువంటి అంశం ఎంచుకుంటే, ఆ బ్లాగు త్వరగా వృద్దిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అని చూస్తే ! ఎక్కువగా దృష్టి పెట్టవలసింది సెర్చ్ ఇంజిన్లో ఏఏ విషయలపై వెతుకుతున్నారు, ఏ విషయం ఎన్నాళ్ళ నుండి ట్రెండిగా ఉంది. ఇంకా ఇంటర్నెట్లో వెతికే విషయాలు ఏ అంశం సంభందించింది, ఆ అంశంపై మనం కూడా గూగుల్ సెర్చ్ వీటికి ఇప్పటికే సుమారు ఎన్ని బ్లాగులు ఉన్నాయి, వాటి ప్రాచుర్యం ఎంతవరకు ఉంది. ఆ బ్లాగులు వివరించే వివరణలు పూర్తీ సంతృప్తికరంగా ఉన్నాయని వ్యూవర్స్ కామెంట్స్ చదివితే ఆ బ్లాగ్ కంటెంట్ పై అవగాహన వస్తుంది. ఇలా వివిధ రకాల అంశాలపై గల బ్లాగులను చూస్తే, మరింత అవగాహన పెరుగుతుంది. బ్లాగు అంటే వివధ అంశాలపై రక రకాల విషయలపై సందేహాలకు సమాధానాలు, లేక వివరణలు తెలిపే వెబ్ పేజిలు కలిసినది.

entertain చేసే విషయలు అంటే సినిమా న్యూస్, ఉప్దాట్స్, రివ్యూస్ మొదలైన వాటిపై అనేక బ్లాగులు ఉంటాయి, entertain అంశం మీ బ్లాగు అంశంగా ఎంచుకుంటే, పోటి ఎక్కువగా ఉంటుంది. ఇంకా బ్లాగు ప్రమోషన్ కోసం వివరణలు ఆకట్టుకునే విధంగా ఉండాలి, బ్లాగుకు SEO బాగా అభివృద్ధి చేయాలి.

Blog Making Views on Websites

కంప్యూటర్స్ మరియు టెక్నికల్ అంశాలు, వీటిలో చాల రకాల వర్గాలు ఉంటాయి, హార్డ్ వేర్ , సాఫ్ట్ వేర్ మరల వాటిలో నెట్ వర్కింగ్ మొదలైనవి. ఇంకా అనేకమైన కంప్యూటర్ అప్లికేషన్లు ఉంటాయి, వాటిపై అంటే సంభందిత అప్లికేషను ఉపయోగం, ఉపయోగించే విధాన వివరణలు, సాదారణ సందేహాలు()సాదారణ సందేహాలు అంటే, సాదారణంగా అప్లికేషను వాడుకలో వచ్చే సందేహాలు) ఇలా ఈ రంగంలో చాలానే అంశాలు లభిస్తాయి. మీ బ్లాగు అంశంగా మీరు ఎంచుకున్న కంప్యూటర్ అప్లికేషనుపై, మీకు పూర్తీ పట్టు ఉంటే, మీరు మీ బ్లాగుని విజయవంతం చేయగలరు. దానితో పాటు SEO వ్రాయవలసి ఉంటుంది.

మొబైల్స్ అంశంలో కూడా కొన్ని గమనిస్తే, కొత్త మొబైల్ న్యూస్, కొత్తగా వచ్చిన మొబైల్ రివ్యూస్, మొబైల్ వాడుకలో సాదారణ సందేహాలపై వివరణ (మొబైల్ వాడేటప్పుడు వచ్చే సందేహాలు, మొబైల్ వాడుకలో ఎదురయ్యే సాదారణ సమస్యలు) , మొబైల్ అప్స్ గురించి వారి వాడుక విషయంలో సాదారణ ప్రయోజనాలు, ప్రత్యెక ప్రయోజనాలు తెలుపుతూ బ్లాగ్గింగ్ చేయవచ్చు. Blog Views: Blog Making Things Practice Earning online Money

ఆన్ లైన్లో అందుబాటులో ఉండే సేవలు, వాటిని ఉపయోగించే విధాన వివరణలు, ఉదా: అదార్ మరియు పాన్ కార్డుల వివరాలు ఆన్ లైన్లో ఎలా మార్చుకోవచ్చు. ఏఏ వెబ్ సైటులో ఆ అవకాశం ఉంది, అలాగే అప్డేట్ చేసే విధానం, జాగ్రత్తలు తెలియజేయడం లాంటివి. ఇలా చాల Govt. డిపార్టుమెంటులకు సంభందించి ఆన్ లైన్లో లభించే సేవలు తెలుసుకొని, అవసరమైన వారికీ అందుబాటులోకి తెస్తే, ఆ బ్లాగు విజయవంతం అవుతుంది.

షేర్ మార్కెట్, ఫైనాన్సు మరియు అకౌంటింగ్ ఈ రంగంలో చాలానే వెబ్ సైట్లు ఉంటాయి, అయితే నైపుణ్యం ఆధునీకరణతో ఉంటే, పాతవి పోయి కొత్తవి అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువ. అలాగే ఎక్కువ ఎకౌంటు నిర్వహణలో సందేహాలకు సమాధానాలు, ఇంకా Tally ఉపయోగించే విధానం, కొత్త అప్డేట్స్, ఫైనాన్సు మరియు షేర్ మార్కెట్ వివరాలు, న్యూస్, విశేషణలు లాంటి వాటిపై కూడా బ్లాగ్గింగ్ చేయవచ్చు.

Travell, Loose Weight, Kitchen Views having more views from users.

ప్రయాణం చేయదగిన స్థలాలు అంటే ప్రాధాన్యత కలిగిన నగరాలూ, ఆయా నగరాలలో విశేషాలు, గుడులు, గోపురాలు, మ్యుజియం, పార్క్స్ షాపింగ్ ప్రత్యేకత కలిగిన స్థలాలు. అలాగే వాటికీ ప్రయాణ సౌకర్యాలు, ప్రయాణ మార్గాలపై, ఆయా చిత్రాలతో వివరణ అర్ధవంతంగా ఉంటే బ్లాగు విజయవంతం అవుతుంది.

ఆడవారికి అయితే వంటలు – వంట విధానం, వంటింటి చిట్కాలు , కొత్త వంటకాలు తయారీ విధానం, పాత వంటకాల ప్రత్యేకతలు, ఆడువారి దుస్తులలో కొత్త కొత్త డిజైన్ మొదలైన విషయలపై బ్లాగ్గింగ్ కూడా లాభాయకంగా ఉండే అవకాశాలు ఉంటాయి.

బరువు తక్క్గడం, పెరగడం వాటిపై లభించే సేవలు, సేవ సంస్థ విషయాలు, వారి ప్రొడక్ట్స్, చిట్కాలు, యోగా సంభందిత సేవల అందించే సంస్థలు, యోగా అసనలపై వివరాలు ఇలాంటివి బ్లాగ్గింగ్ కి ఉపయోగపడతాయి. ఎక్కువగా ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేయడంలో బ్లాగు ద్వారా పోస్టింగ్స్ పెట్టి చేస్తుంటారు.

ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించే విధానం, చాల మందికి ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేక మొబైల్ బ్యాంకింగ్ విధానం తెలియదు. అలాగే బ్రౌజింగ్ విధానం కూడా జాగ్రత్తలు తెలియదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించే విధానం, పొదుపు పధకాలు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సమస్యలు మొదలైన వాటిపై వివరణలు కూడా ఉపయోగపడవచ్చు.

అయితే ఎంపిక చేసుకునే అంశంలో బాగా నైపుణ్యత కలిగి, ఆ అంశాన్ని అర్ధవంతంగా బ్లాగులో చెప్పి, ఆ యొక్క బ్లాగుని SEOతో అభివృద్ధి చేస్తే, ఆదాయం బాగానే ఉండవచ్చు. Blog Views: Blog Making Things Practice Earning online Money అయితే మనకి తెలిసిన అంశంపై ఆన్ లైన్ డిమాండ్ ఎంతవరకు ఉంది, ఆ అంశం ఎలా ప్రోమోట్ చేయగలం అంటే వాటిపై అవగాహన పెంచుకొని బ్లాగ్ ప్రారంబిస్తే బాగుంటుంది.

ధన్యవాదాలు
vegawebviews