Vega

శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు
ఓం గం గణపతయే నమః

ఈ వెబ్ సైటులో నేను వ్రాసే విషయాల వివరాలు, అవసరమైన వారికీ ఉపయోగపడే విధంగా అర్ధవంతంగా కొనసాగాలని, అలాంటి వివరాలు నిరంతరం అవాంతరాలు లేకుండా కొనసాగాలని కోరుకుంటూ ! ఈ వెబ్ సైట్ మీ అందరి మన్ననలను పొందాలని ఆశిస్తూ ! ఆన్ లైన్లో ఆర్జన అవకాశాలు అంటే ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలతో పనిచేస్తూ డబ్బు సంపాదన చేయడం. కాళీ సమయాలలో ఇంటి దగ్గర నుండి ఇంటర్నెట్ ద్వారా పని చేస్తూ ( Money Earning Chances Through Computer & Internet) ఇలా ఆన్ లైన్ ధనార్జన వ్యవహారాలలో ఎంతవరకు ఏఏ అవకాశాలు ఉన్నాయో చూస్తే ! బ్లాగు క్రియేట్ చేయడం, ఆ బ్లాగుని ప్రమోట్ చేయడం, యూట్యూబ్ ఛానల్, ఫ్రీ లాన్సర్ మొదలైనవి కలవు

చాలామంది ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం చాల సులభం అని చెబుతూ ఉంటారు. అవును ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సముపార్జించడం చాల సులభం, అది ఎలా ? ఎప్పుడు సులభం అనేది ఆలోచన చేయకుండా, కొంతమంది ఆన్ లైన్లో ఏదో ఒక మార్గం ఎంచుకుంటే డబ్బు సంపాదనలో వెనుక వరుసలోనే ఉండే అవకాశాలు కలవు. ఏదైనా ఒక విషయం ఎంపిక చేయాలి కానీ వివరంగా తెలుసుకుని, ఎంచుకుంటే సదరు ఎంపికైన విషయంలో విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కంప్యూటర్ లేక లాప్ టాప్ ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుండే డబ్బు, సాదారణ సంపాదన కన్నా ఎక్కువ సంపాదించే వారు కూడా ఉంటారు. వారు ఎలా ? ఏ మార్గం ఎంచుకొని ? ఏవిధంగా విజయవంతం అయ్యింది ? తెలుసుకుంటే ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.
ఫ్రీలాన్సర్ గా ఏ వెబ్ సైట్లో అవకాశాలు కలవు చదవడానికి క్లిక్ చేయండి.
బ్లాగు క్రియేట్ చేయడానికి అందుబాటులో ఉండే బ్లాగ్గింగ్ ప్లాట్ ఫారంలు

ఒక విషయం గమనించాలి, డబ్బు సంపాదన సులభ పద్దతి అంటే మాత్రం అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అదృష్టం అందరికి ఉంటే, డబ్బు ఎలా సంపాదించాలి అనే ప్రశ్నతో ఎక్కువమందికి అవసరం ఉండకపోవచ్చు. కష్టపడితే ఫలితం ఉంటుంది అంటే కష్టపడడం ఉత్తమ మార్గం అని అంటూ ఉంటారు. అయితే ఎంచుకునే మార్గం ఫలితాన్ని ఇస్తుందా లేదా అనేది అనుభవజ్ఞుల అభిప్రాయం వలన అర్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించండి అని చెబుతున్న విషయం ఏమిటంటే ” ఇంటి దగ్గర నుండే ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించడం సులభం అని చెప్పే వారు, వారి అనుభవం ఆధారంగా వెల్లడి చేస్తున్న అభిప్రాయమా లేక గూగుల్ సెర్చ్ లో ఎక్కువమంది ఏదీ వెతుకుతున్నారో, ఆ విషయం సేకరించి ఆ విషయంపై పోస్టులు చేసినట్టు, డబ్బులు సంపాదనా సులభం అనే విషయంపై చెబుతున్నారా అని ఆలోచన చేయాలి. ఎందుకు అంటే !

డబ్బు సంపాదనలో అనుభవజ్ఞులు తానూ ఎంచుకున్న మార్గంలో, తానూ ఎదుర్కొన్న కష్టనష్టాలు వెల్లడి చేస్తే, ఒక విషయంపై విశేషణ చేసేవారు వాస్తవ పరిస్తితులు ప్రతికూల పరిస్థితులపై సరి అయిన వివరణ అందిస్తే, ఏదైనా విషయాన్ని ప్రమోట్ చేయాలనీ చూసేవారు మాత్రం, విషయముపై ఆసక్తి పెంచే విధానంలోనే వివరణ చేస్తారు. కానీ ఆ మార్గంలో కష్టనష్టాల ప్రస్తావన ఉండకపోవచ్చు. ఇదీ విషయం గమనించదగినది.

ఏదైనా సినిమా అంటే అభిప్రాయము సరిగా సేకరించకుండా చూసినా, ఒకవేళ సినిమా బాగా ఉండకపోతే 3 గంటల సమయం వృదా అనుకోవచ్చు, కాని డబ్బు సంపాదనా మార్గంలో మాత్రం కచ్చితత్వం ఉండాలి అని అంటారు. అయితే కాళీ సమయంలోనే కదా.. ప్రయత్నిస్తే పోయేది ఏముంది, విజయవంతమైతే డబ్బు వస్తుందని కొందరు ప్రయత్నిస్తారు. కొంతమంది ఇంటినుండే సంపాదనా అనగానే, తమమీద ఎవరి అజమయాషి ఉండదు కదా అని ఫుల్ టైం ప్రయత్నిస్తారు. ఫుల్ టైం ప్రయత్నం చేసిన పార్ట్ టైం పనిచేసినా, డబ్బు సంపాదనలో ఫెయిల్ అయితే మాత్రం నిరుత్సాహం వస్తుంది.

ఇంతకీ ఇదంతా వ్రాస్తున్న నా పరిస్థితి ఏమిటంటే, ప్రయత్నం మీద ప్రయత్నం వలన, చేస్తున్న తప్పులు తెలుస్తున్నాయి. ఎంచుకున్న అంశం యొక్క ప్రాధాన్యత, ఆ అంశం యొక్క ప్రభావం ఎంతవరకు ఇలాంటివి కొన్ని తెలుస్తున్నాయి. నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి ఆన్ లైన్ బ్రౌజింగ్ చేస్తున్నాను. మొదటసారిగా గూగుల్ బ్లాగర్ అంటే ఏమిటో తెలిసింది, బ్లాగ్ క్రియేట్ చేశా , కానీ బ్లాగ్ కంటెంట్ మరియు ప్రమోట్ చేయడంలో నా అవగాహనా రాహిత్యం వలన గూగుల్ వారు రిజెక్ట్ చేసారు. తరువాత వర్డ్ ప్రెస్ బ్లాగ్గింగ్ ప్రయత్నం చేశా, తరువాత బ్లాగులు కాదు అని వెబ్ డిజైన్ కోర్స్ నేర్చుకున్న, అలాగే వెబ్ డెవలప్ మెంట్ కోర్సులు జాయిన్ అయ్యాను. ఇప్పడు వెబ్ సైట్ క్రియేట్ చేయడం, బ్లాగు క్రియేట్ చేయడం నాకు చాల సులభం. సరే ఇక మనం అసలు విషయం ఇంటి నుండే ఇంటర్నెట్ ద్వారా ధనార్జన చేయడం ఎలా ? అవకాశాలు ఏమిటి ? చూస్తే

అసలు ఆన్ లైన్లో ఆర్జన అవకాశాలలో ఎక్కువగా బ్లాగ్గింగ్, యూట్యూబ్ వీడియో ఛానల్, ఫ్రీలాన్సర్ affiliate ప్రోగ్రాం, కాప్చర్ వర్క్, ముఖ్యంగా ఉంటే ఇంకా యాడ్స్ చూడడం, వీడియోలు చూడడం, మొబైల్ అప్స్ రిఫర్ చేయడం మొదలైన అవకాశాలు ఉంటాయి. ఇలా డబ్బు సంపాదించాలంటే కావాల్సిన అర్హతలు అంటే, మనం ఎంచుకున్న విషయంపై ఆధారపడి ఉంటుంది. యాడ్స్ , వీడియోలు వంటివి టాలెంట్ సంభందం లేదు. కానీ బ్లాగ్గింగ్ మరియు యూట్యూబ్ ఛానల్ ఇవి ప్రయత్నించే కొలది సులభంగా ఉంటాయి కానీ మొదట్లో మాత్రం కాదు. అలాగే కొంతకాలం గడిచాక మీరు బ్లాగులో పోస్టులు సక్రమంగా లేకపోతే, లేక మీరు ఎంచుకున్న విషయం ట్రెండ్ కాకపోయినా సంపాదనా తగ్గుతుంది. మొదట్లో కష్టపడాలి ఎక్కువమందికి తెలియపరచడం కొరకు, తెలియజేసిన అంశం అందరికి నచ్చి మరలా వారు బ్లాగుని సందర్శించాలి, అలా అందరికి అందుబాటులో కష్టపడి తెచ్చి, కష్టం చేసి, తెచ్చిన వృద్దికరమైన పనిని ఇష్టంతో అభివృద్ధి చేస్తుంటే, అప్పుడు ఆ సంపాదనా మార్గంలో మనం విజయవంతమైనట్టే !
ఆన్ లైన్లో డబ్బు సంపాదనకు బ్లాగు ఎంపిక ఎందుకు ? చదవడానికి క్లిక్ చేయండి.
బ్లాగు ప్రమోట్ చేయడానికి తెలుసుకోవాల్సిన ఆన్ లైన్ విషయాలకై క్లిక్ చేయండి.

కష్టపడి అందరికి చేరవేసి, చేరిన విషయముపై శ్రద్ధపెట్టి, ఇష్టంతో ఇంకా వృద్ది చేస్తూ ఉంటే, అది సులభం ఎలా అవుతుంది. సులభం అదృష్టం ఉంటే అని మొదట్లో చెప్పుకున్నాం కదా అది ఎలా ఉండవచ్చు అంటే, ఉదా: మార్కెట్లోకి కొత్త వస్తువు రాబోతుంది, ఆ వస్తువుని గురించి వివరాలు కానీ, ఒక కొత్త వస్తువుపై అవగాహనా మీకే ఏర్పడి, సదరు వస్తువు అందరికి అవసరం అయితే, అప్పుడు ఆ విషయంపై అవగాహన కల్పించే వీడియోలు మరియు బ్లాగులు విజయవంతం అవుతాయి. ఈ వివరాలు కానీ కొత్తవస్తువుపై తొలి అవగాహన ముందుగా తెలిసిన వ్యక్తి అదృష్టవంతుడే. అప్పుడు సదరు వ్యక్తి బ్లాగ్ క్రియేట్ చేయడం కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రారంభిస్తే, అతనికి సులభం ఎందుకంటే, మొదటగా అతనే చెబుతున్నాడు అందరికి అవసరమైన విషయముపై. అయితే అతను తెలుసుకోవడానికి కూడా ఎంతో కష్టపడి ఉండాలి కదా ! ఎదో ఒక రకమైన కష్టం లేకుండా డబ్బు సంపాదనా ఉండదు, సులభంగా డబ్బు సంపాదనా దీర్ఘకాలిక రాబడి అవ్వదు.

నేను నిరుత్సాహపరచటానికి ఈ విషయం చెప్పడం లేదు, ముందు దారిలో ముల్లు ఉన్నాయంటే, జాగ్రత్తగా నడుస్తాం, చీమలు ఉన్నాయని గమనిస్తే, వాటిపై అడుగుపడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తాం ! దారి ముల్లదారి అయ్యినప్ప్దుడు ఆటే వెళ్ళాలి కనుక తెలిసి కొన్ని ముల్లులు తప్పించుకున్నా ఎదో ఒక ముల్లు మీద తెలిసి అడుగు వేస్తాం, ఎరుకతో అడుగు వేశాం కనుక, ముల్లు గుచ్చుకున్న బాధని బరిస్తాం ! అలాగే చీమలపై తెలిసి అడుగువేసి, ఆ భాదని బరిస్తాం. కానీ తెలియకుండా అకస్మాత్తుగా ముల్లుపై అడుగు వేసిన కొన్నిరకాల చీమలుపై అడుగు వేసినా, బాధ ఎక్కువగా ఉంటుంది. తెలిసి చేస్తే కష్టం కూడా ఇష్టపడి చేస్తాం, తెలుసుకోకపోతే, చిన్న చలి చీమ పాకిన ఉలిక్కిపడే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఎంచుకున్న మార్గంపై సరైన అవగాహన ఏర్పరచుకొని, ప్రారంభిస్తే అది విజయవంతం అవుతుంది.

ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పడు, ఎక్కువ సంపాదనా కోసం ఏదైనా వృత్తిపరమైన లేక ఇంకొక ప్రత్యెక కోర్స్ చేసి, వేరే చోటుకి ఎక్కువ జీతానికి ఉద్యోగి మారినట్టు, సాదారణ ఉద్యోగం చేసుకుంటూ, ఆన్ లైన్లో అవకాశం, ఆ అవకాశం ఉపయోగించడానికి అవసరమైన విషయ విజ్ఞానం నేర్చుకొని, కొన్నాళ్ళు కాళీ సమయాలలో ప్రయత్నం చేస్తూ, అది విజయవంతం అవుతున్న కొలది పూర్తీ సమయం ఆన్ లైన్ సంపాదనపై ద్రుష్టి పెడితే మంచిదని నా అభిప్రాయం. ఎందులోనైనా నిరుత్సాహం రావచ్చు రాకపోవచ్చు. కానీ డబ్బు విషయంలో వూరికే వస్తుంది నిరుత్సాహం. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం ఉత్తమం అంటారు. అవగాహన చేసుకుని ప్రయత్నం చేయాలి

ఎవరు క్రియేట్ చేయవచ్చు అంటే ? స్వయంగా తన ఇమెయిల్ తానే పంపించుకునే బ్రౌజింగ్ అవగాహన కలిగి ఉన్న వ్యక్తికి బ్లాగు క్రియేట్ చేసేవిధానం తొందరగా అర్ధం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్మార్ట్ ఫోన్ వాడకం వస్తే చాలు. కానీ బ్లాగ్ అయిన వీడియో ఛానల్ అయిన ప్రమోట్ చేయడంలో కష్టపడాలి. ఎంచుకున్న అంశం ట్రెండిగా ఉండి అందరికి ఉపయోగకరమైనది అయితే, సులభం. పోటి ఉన్నఅంశాలు అయితే, మీరు ఆ అంశం అందరికన్నా ఉత్తమంగా చెప్పగలగాలి, అలాగే సదరు అంశాన్ని ఎక్కువమందికి తెలియపరిచే బాద్యత కూడా మీదే అవుతుంది. ఇంకా బ్లాగ్గింగ్ అయితే మాత్రం కంప్యూటర్ టైపు కూడా కొంచెం బాగా వచ్చి ఉంటే విషయలుపై వివరణలు తొందరగా వ్రాయగలం.

బ్లాగ్గింగ్ చేయడం ఎలా ? యూట్యూబ్ ఛానల్ ఎలా చేయడం ? కంటెంట్ ఎంపిక , బ్లాగ్ ప్రమోషన్ మొదలైన విషయాలపై నాకు తెలిసిన విషయాలు, వివరణలు ఇంకా ఆన్ లైన్లో వివరణల లింకులు మీకు ఈ వెబ్ సైటులో తెలియపరచగలనని అనుకుంటున్నాను. డబ్బు సంపాదనా విషయాలపై వివరాలు ఇచ్చే అనేక బ్లాగులు ఇంగ్లీష్ బాషలో ఉంటాయి, తెలుగులో అందుబాటులోకి ఆ విషయాలు తీసుకువచ్చే నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ

ధన్యవాదాలు
vegawebviews