Blogging Things Should Reliably Readable

Vega Web Views Blogging Things Should Reliably Readable

vegabloggingwebviews: Blogging Things Should Reliably Readable బ్లాగు విషయంలో ఎంపిక చేసుకున్న కంటెంటు విషయంలో అధునాతన విషయాలను జోడిస్తూ ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ, పాత పోస్టుల మళ్ళి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇంకా బ్లాగు కంటెంటు విషయంపై బ్లాగులో ఉంచిన పోస్టులకు తగినట్టుగా వీడియోలు చేసి సదరు బ్లాగు ప్రొఫైలుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తే బ్లాగు వలన మరియు యూట్యూబ్ వలన ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి.

బ్లాగును ప్రమోట్ చేయడంలో సోషల్ మీడియా షేరింగ్స్ ఉపయుక్తమని ఇంతకుముందు బ్లాగు పోస్టులలో తెలియజేయడం జరిగింది. బ్లాగు ట్రాఫిక్ పెంచడానికి ప్రోమోట్ చేయడానికి సంభందించిన పోస్టు చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Blogging Things Should Reliably Readable బ్లాగు విషయాలు ఎంపికలు కూడా గతపోస్టులలో వివరించబడి ఉంది. సాదారణంగా బ్లాగు సృష్టించాలి అని అనుకున్న వ్యక్తికి కచ్చితంగా తానూ బ్లాగు ద్వారా తానూ చెప్పదలుచుకున్నవిషయంపై అవగాహన ఉంటుంది. అయితే అలాంటి వారు కచ్చితంగా సదరు ఎంపిక విషయంలో నైపుణ్యం కలిగి ఉండి ఉంటారు. రోజు నిర్ణిత కాళి సమయం ఉండి, ఇంట్లో కంప్యూటర్ ఇంటర్నెట్ ఉంటే సదరు వ్యక్తులు బ్లాగు మరియు యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తే అదనపు ఆదాయం సంపాదించవచ్చు అని చెప్పబడింది. అయితే బ్లాగు ప్రారంభానికి అంశాలు ఎంపికలో సంకిప్త వివరణ మీకు ఉపయోగపడవచ్చు, చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

గూగుల్ బ్లాగు అయితే పూర్తీ ఉచితంగా ప్రారంభించవచ్చు, బ్లాగర్ ద్వారా గూగుల్ బ్లాగర్ సృష్టించడం ఎలా అనే విషయం చిత్రాలతో కూడిన వివరణ చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

విషయాలు అదునాతనము అంటే ట్రెండిగా ఉండాలి అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా రోజువారి సెర్చ్ జరిగే పదాలు పట్టుకోవడం ప్రధమం. ఎందుకంటే బ్లాగులో వ్రాయబడిన ఆర్టికల్ అంటే విశ్లేషణ లేక వ్యాసంలో ఉండే సబ్ హెడ్డింగ్స్ లాంటి వ్యాక్యాలలో ఉపయోగించే పదాలతో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెతికే పదాలతో మ్యాచ్ అయినప్పుడే సదరు బ్లాగువివరాలు సెర్చ్ ఇంజిన్లో ప్రత్యక్ష్యం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కచ్చితంగా గూగుల్ టెండ్స్ ని పరిశీలన చేస్తూ బ్లాగుపోస్టులను వ్రాస్తూ ఉంటే, ఒకనాటికి కచ్చితంగా బ్లాగు ట్రాఫిక్ పెరిగే అవకాశాలు ఉంటాయి.

గూగుల్ సెర్చ్ ఇంజిన్ అందరికి ఆన్ లైన్ అడ్డా

ప్రతిరోజు అనేకమంది గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేక విషయాలు కోసం ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో ఎక్కువగా ఎవరు ఏమిటి సెర్చ్ చేసే అవకాశం ఉంది అనే ఊహ కూడా ప్రధానమైన విషయం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉపయోగించే వారిలో చదువుకునే వారు ఉంటారు, వారు చదువులో సహాయపడే సబ్జెక్ట్ సంభందిత విషయాలపై సెర్చ్ చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఉంటారు, వారు తాము చేస్తున్న వృత్తిలో వచ్చే సందేహాలు కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తారు. ఇంకా విద్యార్ధులు పై చదువుల కోసం మంచి కాలేజీలు కోసం వెతుకుతారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణపై వెతుకుతారు. ఈ విషయాలలో బ్లాగ్గింగ్ చేయాలంటే కచ్చితంగా నైపుణ్యం ఉండాలి. ఎందుకంటే తమకు తెలియని విషయం గురించి వెతుకున్నారు అంటే సంభందిత తెలియని విషయంలో నైపుణ్యం కలిగిన వారే ఆ సమస్యలను ఊహించి బ్లాగ్గింగ్ చేయగలరు.

Blog Things Most Readable & Relaible To Trendy Views

Blogging Things Should Reliably Readable
బ్లాగు పోస్టు వ్రాయడంలో చిత్రాలు, హెడ్డింగ్స్ గురించి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ పై వ్రాయడం జరిగింది.

సాదారణ సెర్చ్ ఎలా ఉండబోతుందనేది ముఖ్యమైన విషయం, రేపటి రోజునా ఏ విషయం గురించి సాదారణ సెర్చ్ ఎలా ఉంటుందో ఊహించగలిగితే సదరు బ్లాగర్ తొందరగా విజయవంతం అవుతారు. ఒక ప్రత్యేక విషయమునకై లేక సందేహమునకై సెర్చ్ చేసే వారు అవసరమైనప్పుడే సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ చేస్తున్న విషయాన్ని ముందుగా బ్లాగుపోస్టు ద్వారా పొందుపరిచి ఉంటే అది వెతికే విషయానికి సరి అయ్యి ఉంటే సదరు బ్లాగు వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజిన్ బ్రౌజర్లో చూపుతుంది. ఉదా: ఈరోజు విశేషాలు గుర్తుచేసుకుని, ఈరోజుని ఒకరోజు నుండి ఆలోచనను వెనుకటి రోజుకు తీసుకువెళ్ళి, మీ ఆలోచనను రేపటికి వచ్చే విషయాలు గురించి ఆలోచిస్తే!

గతించిన బాలీవుడ్ నటి మీనాకుమారి జయంతి ఒక విశేషంగా, ప్రస్తుత నటి తాప్సీ జన్మదినం కూడా ఈరోజుగా ఉంది. మీనకుమారి, తాప్సీ గురించిన వివరాలు వెతికే అవకాశం ఉంటుందని గ్రహించి తదనుగుణంగా బ్లాగుపోస్టులు తయారుచేయడం. ఇలా ప్రసిద్ద ప్రస్తుత, గతించినవారి విశేష రోజులు  సిని నటులు, క్రీడాకారులు, ప్రసిద్ద రాజకీయ నాయకుల గురించి సెర్చ్ ఫలితాలు సాదారణ గూగుల్ సెర్చ్ గా ఉండవచ్చు. ప్రముఖుల పుట్టినరోజులు ఒకవేళ మరణించిన ప్రముఖులు అయితే వారి జనమరణ వివరాలు కూడా సమాజం గుర్తుచేసుకునే అవకాశం వారు సమాజంపై చూపిన ప్రభావం ఆధారంగా ఉంటుంది.

ఇంకా సమాజంలో సహజంగా జరిగే విశేషాలు వినాయక చవితి వస్తే, ఆ పండుగ వివరాలు, వ్రత కల్ప పుస్తకాల గురించి, వినాయక చవితి విశేషం పండితుల అభిప్రాయాలు, పండుగలో పూజకు ఉపయోగించే పత్రి వలన సైన్సు ప్రకారం కలిగే ప్రయోజనాలు ఇలా వివిధ తిథుల అనుసరించి ఆ తిధి దైవ విశిష్టతలు గురించి చెప్పడం బ్లాగ్గింగుకి బాగా ఉపయుక్తం. యూట్యూబ్ ఛానల్లలో అయితే ఇవే వీడియోలు చాలానే ఉంటాయి.

Political views, Result views have mores views

రాజకీయ విశేషాలు, రాజకీయ ప్రముఖుల పార్టీ వివరాలు, ప్రసిద్ద రాజకీయ నాయకుల చేపట్టే ప్రజా కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలను ఎండగట్టే ప్రతిపక్ష పార్టీ విధానాలు రాజకీయ విషయలపై విశ్లేషణలు ఏదైనా ఆధారాన్ని అనుసరించి చేయడం ఉత్తమం అని అంటారు. వాతావరణ పరిస్థితులు, కాలుష్యం ఇది ఒక మంచి విషయంగా చెప్పబడుతుంది, సామజిక సమస్యగా ఉంది.

విద్యార్దులకు పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఫలితాల గురించిన అప్డేట్స్ గూగుల్ సెర్చ్ గా ఉండవచ్చు. ఫలితాలు వచ్చాకా కొత్త కోర్సులు, కోర్సులు అందించే సంస్థలపై కూడా సెర్చ్ ఉండవచ్చు.

సాదారణంగా అడపాదపా అన్నట్టుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతుకులాట ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా విషయాలలో చిత్ర విషయాలు ఎప్పటికప్పుడు ఆకర్షణీయంగా ఉంటూ ఉంటే, క్రీడల విషయాలు క్రీడలు జరుగుతున్నా సమయాలలో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఎక్కువగా సెర్చ్ జరిగే అవకాశాలు ఉంటాయి. బ్లాగు అంశం అధునాతనంగా ఇంతకుముందు ఎవరు చెప్పని విధంగా వెబ్ మాస్టర్ నియమ నిభందనలు అనుసరించి ఉంటే సదరు బ్లాగు ఆదాయ మార్గాలు బాగుంటాయి.

బ్లాగు పోస్టింగ్ విషయాలలో వ్యాసాలు చిత్రాలను కూడా కలిగి ఉంటే సదరు పోస్టు ఆకర్షణీయంగా ఉంటుంది. Blogging Things Should Reliably Readable అలాగే ఆ చిత్రాలు బ్లాగుపోస్టు చేసున్న కంటెంటుకి సంభిందించినవి అయ్యి ఉండాలి.

ధన్యవాదాలు.
vegawebviews