Available Blog Creating / making online Sources

Available Blog Creating / making online Sources For Website

Web Design Templates, Blogging Platforms, Hosting Provders, Domain Selection, Seo Tips

Available Blog Creating / making online Sources For Website బ్లాగు సృష్టించడం సులభం, రోజూ వివరాలు అందించడం, ఆ వివరాలు అందరికి చేరేలా చేయడం అంత సులభం కాదు. అయితే బ్లాగ్ సృష్టించడానికి కావాల్సిన ఆన్ లైన్ విషయాలు ఏమిటి చూస్తే ! ముందుగా ఇమెయిల్, తరువాత బ్లాగ్గింగ్ ప్లాట్ ఫారం, ప్రొఫెషనల్ బ్లాగ్గింగ్ అయితే సొంత డొమైన్ నేమ్ మరియు హోస్టింగ్ స్పేస్ కలిగి ఉండడం మంచిదని అంటారు. మొదట్లో ఉచిత బ్లాగ్గింగ్ ఉపయోగిస్తే, బ్లాగ్గింగ్ విధానం తెలుస్తుంది, కాలం ఖర్చు అవుతుంది, ధనం రాకపోయిన ధనం ఖర్చు కాదు. ఉచిత బ్లాగ్గింగ్ అయితే పరిమితులు కలిగి ఉంటాయి, మొదట్లో పరిమిత బ్లాగ్గింగ్ బెస్ట్ అంటారు కాబట్టి ఉచిత బ్లాగ్ ప్లాట్ ఫార్మ్స్ ఏమిటో చూద్దాం.

బ్లాగర్ గూగుల్ సంస్థ వారిది, ఉచిత బ్లాగ్ మేకింగ్ ప్లాట్ ఫార్మ్. బ్లాగ్ నిర్వహణకు ఉచిత సర్వర్ స్పేస్ మరియు సబ్ డొమైన్, మరియు టెంప్లేట్స్ అందిస్తారు. ఈ టెంప్లేట్స్ తక్కువగా ఉంటాయి, ఇతర బ్లాగ్గింగ్ ప్లాట్ ఫార్మ్స్ తో పోల్చి చూస్తే. అయితే ఉచిత బ్లాగులకు బ్లాగర్ బెస్ట్ ఎంపిక అంటారు. చాల సులభంగా బ్లాగ్ create చేయవచ్చు, కేవలం జిమెయిల్ ఎకౌంటు ఉంటే సరిపోతుంది. టెక్నికల్ నైపుణ్యం లేనివారు కూడా బ్లాగు సృష్టించవచ్చు. ప్రధానంగా గూగుల్ సెక్యూరిటీ బ్లాగుకి లభిస్తుంది.

వర్డ్ ప్రెస్.కాం పాపులర్ వెబ్ సైట్ మేకింగ్ ప్లాట్ ఫార్మ్ ఇది ఉచిత బ్లాగు కంటే ప్రొఫెషనల్ బ్లాగ్గింగ్ చేయడానికి బాగుంటుంది. ఉచిత బ్లాగ్గింగ్లో పరిమితులు ఎక్కువగా ఉంటాయి. ఉచితంగా అయితే సులభంగా బ్లాగ్ సృష్టించవచ్చు, కేవలం ఇమెయిల్ ఉపయోగించి.

వర్డ్ ప్రెస్ ఆర్గ్, ప్రొఫెషనల్ బ్లాగ్గింగ్ అయితే మాత్రం డొమైన్ మరియు హోస్టింగ్ ఎకౌంటు కొనుగోలు చేయాలి, తద్వారా లభించే హోస్టింగ్ CPanel ద్వారా వర్డ్ ప్రెస్ సెటప్ చేసుకుని, థీమ్ సెలక్షన్ మరియు పోస్టింగ్స్ నిర్వహించవచ్చు. ఈ ప్రాసెస్ కోసం కొంచెం టెక్నికల్ స్కిల్స్ అవసరం అవుతాయి. హోస్టింగ్ మరియు డొమైన్ నేమ్ అందించే ఆన్ లైన్ సంస్థలు చాలానే ఉన్నాయి.

టంబ్లర్: ఇది రెగ్యులర్ బ్లాగ్గింగ్ నుండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మరియు ఇతర బ్లాగులను ఫాలో అవ్వడం, సోషల్ షేరింగ్, తిరిగి బ్లాగ్గింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఇది ఉచితంగా లభిస్తుంది సులభంగా విషయాలు షేర్ చేయవచ్చు.

మీడియం బెస్ట్ బ్లాగ్గింగ్ సైట్లలో ఇది ఒకటిగా చెబుతారు. ఎన్ని పోస్తులైన పోస్ట్ చేయవచ్చు. ప్రారంభ బ్లాగ్గర్స్ తేలికగా పోస్టింగ్స్ చేయవచ్చు. అలాగే క్రియేటివ్ రైటర్స్ లేక ఆర్టిస్ట్ విభాగంలో ప్రొఫెషనల్స్ బ్లాగ్గింగ్లో బాగా రాణించగలరు.

డ్రుపాల్: పూర్తీ కంటెంట్ మనజ్మేంట్ సిస్టం, సెక్యూర్ బ్లాగ్గింగ్ దీని ప్రత్యేకత, కాకపోతే టెక్నికల్ వెబ్ నాలెడ్జ్ అవసరం. ఇతర ప్లాట్ ఫోరమ్స్ తో పోల్చితే, సెక్యురిటి ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ వెబ్ సైట్లకు అనుకూలంగా ఉంటుంది అంటారు. ఉచిత బ్లాగ్గింగ్ కుదరదు. హోస్టింగ్ మరియు డొమైన్ నేమ్ కొనుగోలు చేసి, హోస్టింగ్ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకుని బ్లాగ్గింగ్ చేసుకోవాలి.

జూమ్లా : ఇది కూడా కంటెంట్ మనజ్మేంట్ సిస్టం, ఉచిత బ్లాగ్గింగ్ కాకుండా హోస్టింగ్ మరియు డొమైన్ కొనుగోలు చేసి, బ్లాగ్గింగ్ చేయవచ్చు. వర్డ్ ప్రెస్. ఆర్గ్ ప్రొఫెషనల్ గా ఉండి, తేలికగా ఉపయోగిస్తే, జూమ్లా వర్డ్ ప్రెస్ కన్నా కొంచెం టఫ్ అని అంటారు.

విక్ష్: పూర్తీ టెక్నికల్ నాలెడ్జ్ తో సంభందం లేకుండా, కేవలం ఇమెయిల్ సొంతంగా పంపించడం వచ్చిన వారుకూడా బ్లాగ్గింగ్ చేయవచ్చు. డ్రాప్ అండ్ డ్రాగ్ పద్దతిలో బ్లాగు create చేయవచ్చు. అంత సింపుల్ కానీ ఉచిత బ్లాగ్గింగ్ ప్లాన్స్లో పరిమితులు ఎక్కువ.

ధన్యవాదాలు
vegawebviews