VegaWeb

vegaweb

vegaweb పేజి: ఎలా చేయాలి? ఎలా ఉపయోగించాలి? ఎలా ఏవిధంగా? అనే కాన్సెప్ట్ ఇంటర్నెట్లో ఒక ట్రెండ్ థింగ్. ఎలా సంపాదించాలి? ఎలా బ్లాగ్గింగ్ చేయాలి ? ఎలా పోస్టు చేయాలి ? బ్లాగుని ఎలా ప్రమోట్ చేయాలి? ప్రశ్నల పరంపర ఇంటర్నెట్లో కురుస్తూ ఉంటుంది. Howto అనేది ఒక పెద్ద కీవర్డ్ గా ప్రసిద్ది చెందింది. vegaweb పేజి ద్వారా వెబ్లో ఉండే వెబ్ వివరాలు నాకు తెలిసినవి తెలియజేయగలను. గమనించగలరు.

సాంకేతికత అభివృద్ధి చెందిన తరువాయి అనేక సందేహాలు అనేక ప్రశ్నలు పుడుతూనే సాంకేతికంగానే పూర్తీ అవుతున్నాయి. సాంకేతిక పరికరాలలో కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్లు ఇవి నిత్యం సమాజంతో ముడిపడి ఉంటాయి. కంప్యూటర్ ఉందంటే అందులో వేలకొలది సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిలో వచ్చే సందేహాలు అనేకంగా ఉంటాయి. అయితే కంప్యూటర్, లాప్ టాప్ వినియోదారుల శాతం స్మార్ట్ ఫోను వినియోగదారుల శాతం కన్నా తక్కువగానే ఉంటుంది.

చాలా సాంకేతిక విషయాలలో కొంతమంది ఔత్సాహికులు వెబ్ పేజి ద్వారానో యూట్యూబ్ ఛానల్ ద్వారానో తమకు తెల్సిన నైపుణ్యాలపై వివరణలు తెలుపుతూ ఉంటారు. వెబ్ పేజిలో డేటా టెక్స్ట్ రూపంలో ఉంటే, యూట్యూబ్లో వీడియోల మాదిరి ఉంటాయి. ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకోవడం దగ్గర నుండి  వెబ్ అప్లికేషను ఎలా తాయారు చేయాలో అనేక వీడియోలు యూట్యూబ్లో లభిస్తాయి. చూసేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు ఆలోచన ఒకలాగ సాగకపోతే మరలా మరలా వీడియోను వీక్షించాలి. vegaweb పేజిలో చదవండి..

సాంకేతిక సందేహాలలో వివిధ విషయాలలో సందేహాల గురించి వివరిస్తూ విశ్లేషణలు అందించే వెబ్ సైట్లు అనేకంగానే ఉంటాయి. బ్లాగ్గింగ్ చేయడం ఎలా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫార్ములా ఎలా అప్లై చేయాలి. పవర్ పాయింట్లో అనిమేషన్ ఎలా ? అనేక విషయాలలో సందేహాలను తెలియపరుస్తూ ఉండే బ్లాగు పోస్టులు ఆన్ లైన్లో వివిధములుగా లభిస్తాయి.

web views as how to

ఎక్కువగా స్మార్ట్ ఫోన్లో సందేహాలు ఉంటే అందులో మరలా ఎక్కువగా స్మార్ట్ ఫోనుతో ఇంటర్నెట్ ఎలా కంప్యూటర్ కి కనెక్ట్ చేయాలి ? ఇంట్లో ఉన్న టీవీకి స్మార్ట్ ఫోను ఎలా కనెక్ట్ చేయాలి లాంటి సందేహాలు ఉంటాయి. కొత్తగా వచ్చిన ఓఎస్ ఎలా ఉపయోగించాలి ? మొదలైన విషయాలలో అనేక సందేహాలు. సాంకేతిక సందేహాలు కాబట్టి సాంకేతికంగా వెబ్ సైట్ / బ్లాగు ద్వారా తెలుసుకోవచ్చు.

అభివృద్ధి చెందిన సాంకేతిక పరికరాల్లో ఉండే సందేహాలు టాప్ లిస్తుగా చేసి వాటిపై వివరణ ఇచే వెబ్ సైట్లు కొన్ని ఉంటే, సాంకేతిక పరికరాలు లేక సాంకేతిక ప్రోగ్రామ్స్ వలన లాభ నష్టాలను తెలుపుతూ వివిధ రచయతల రచనలను ఆర్టికల్స్ గా ప్రచురించే వెబ్ సైట్లు కొన్ని ఆన్  లైన్లో లభిస్తాయి.

ఐఫోన్, ఐపాడ్ ఇవి ఎక్కువగా ధనవంతులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఐఫోను భద్రత ఎక్కువ కాబట్టి వాడుక విధానం సాధారణ స్మార్ట్ ఫోనుకి బిన్నంగా ఉంటుంది. ఐఫోనులో సఫారీ వాడుక ఎలా? బుక్ మార్కింగ్ ఎలా ? అనేకానేక విషయాలపై ఐఫోనుకి సంభందించి పోస్టులు పెడుతూ ఉంటారు. How to use iPad ? How to browse in iPhone ? Some things do with your iPhone / iPad / Macbook. ఇలా అనేక విషయాలలో వివరణలు బ్లాగు పోస్టులుగా అవతరిస్తాయి.

Doubts About Technical Things

సాంకేతిక అంశాలలో సందేహం కలిగినవారికీ అది వెంటనే తీరిపోతే సమస్యే లేదు ఒకవేళ ఆ సందేహం తీర్చుకోవడానికి వారు ఎక్కువ కష్టపడితే మాత్రం గుర్తుపెట్టుకుంటారు సదరు సాంకేతిక సందేహాన్ని. అయితే అటువంటి సందేహాలు ఎక్కువగా ఉంటే ఆలోచన పుడుతుంది, నాలాగా ఇంకా ఎవరైనా ఈ ఇబ్బంది కలిగి ఉన్నారా? అని. అప్పుడు అటువంటి సందేహాలు వారు సంపాదించిన అనుభవం జోడించి వారు సందేహాలపై విశ్లేషణలతో కూడిన వ్యాసాలు (ఆర్టికల్) వ్రాయడం ఉంటుంది. అలా సదుద్దేశంతో ప్రారంభం అయినా చాలా బ్లాగులు ఆర్ధిక అర్జన కూడా పొందుతున్నారు. ఇలా ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు ట్రెండిగా ఉన్నాయి.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ప్రపంచంలో ఎక్కువమంది వాడే ఓఎస్ ఫోన్లుగా ఉన్నాయి. అందుకే వీటిపై అనేక బ్లాగులు, యూట్యూబ్ వీడియోలు ఆన్ లైన్లో అటుఇటు తిరుగుతూ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు ఎలా వాడాలి ? స్మార్ట్ ఫోనుకి హాని చేసే గేమ్స్ మొబైల్ ఆప్స్ ఏమిటి ? ఆండ్రాయిడ్ ఫోన్లు కొత్తవి ఏమిటి ? కొత్త వెర్సన్ ఫోన్లు ఏమిటి ? ఇలా పలురకాల పోస్టులు పురుడుపోసుకుంటూ ఉంటాయి.

ఇంకా ఇంటర్నెట్ అసలు విషయం ఇదే ! ఇంటర్నెట్ అంటే ఏమిటి ? నెట్ వర్కింగ్ అంటే ఏమిటి ? హార్డ్ వేర్ అంటే ఏమిటి ? హార్డ్ వేర్ రిపేర్ ఎలా ? రామ్ క్లీనింగ్ ? హార్డ్ డిస్క్ క్లీనింగ్, ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేయాలి ? వైఫై ఎలా వాడాలి ? వైఫై సెక్యూరిటీ ఎలా? మొదలైన హార్డ్ వేర్ నెట్ వర్కింగ్ విషయాలలో వివరణాత్మక పోస్టులు అనేకం ఆన్ లైన్లో లభిస్తాయి. vegaweb పేజి చదవండి….

Review Things Web Views

స్మార్ట్ షాపింగ్ వచ్చాక రివ్యూ వెబ్ సైట్ల హవా పెరిగింది. ఇంటి నుండే అన్ని షాపింగ్ చేయడం వలన కొనవలసిన వస్తువు కొనదగినదా ? కాదా అని ఆన్ లైన్లో అభిప్రాయం సేకరించి అప్పటికప్పుడే కొనుగోలు చేసే స్థితికి సాంకేతికత అభివృద్ధి చెందింది. కొత్త వస్తువుల పనితీరు సదరు వస్తువు తయారీదారు బ్రాండు పేరు గురించి వివరించే వెబ్ సైట్లు అనేకం లభిస్తాయి. ఇంకా ఉత్పత్తులు, ఉత్పత్తి పనితీరుని అనుసరించి రేటింగ్ ఇస్తూ ఉంటాయి.

ఏ సాంకేతిక విషయంలో ఎటువంటి సాంకేతిక సందేహం అయిన నెట్ ఆధారితంగా ఉన్న పరికరాల సహాయంతో ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ల సహాయంతో బ్రౌజర్లలో తెలుసుకోవచ్చు. సాంకేతిక సందేహాలు తీర్చే అనేక వెబ్ సైట్లు లేక బ్లాగులు మనకి ఆన్ లైన్లో అనేకంగా ఉన్నాయి. అలాగే బ్లాగ్గింగ్ చేయడం ఎలా ? బ్లాగ్ కంటెంట్ విషయంలో వివరణలు అందించే వెబ్ సైట్లు లేక బ్లాగులు కూడా అనేకమే ఉన్నాయి. vegaweb పేజి చదవండి….

Find in How To Anything in Online

Lifewire: మీకు ఏదైనా సాంకేతిక సందేహమా అయితే ఆ సందేహం ఎలా చేయాలి, ఎలా వాడాలి లాంటివి అయ్యి ఉండి, కంప్యూటర్ / ఆండ్రాయిడ్ / ఐఫోను తదితర అంశాలలో అయితే ఈ వెబ్ సైట్ దర్శించండి ఇందులో రకరకాల పోస్టులు ఎలా ఏమిటి అనే కాన్సెప్ట్ ఆధారంగా ఉంటాయి. ఏ వెబ్ సైట్ దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.  ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ వెబ్సైటు 670 అలెక్షా (Alexa) ర్యాంకుని కలిగి ఉంది.

గూగుల్ ట్రెండ్స్ అంటే పోకడలు దోరణలు అని చెబుతారు. ఇవి ఈరోజు ప్రసిద్దంగా ఏమిటి ఉంది, ఏమిటి ప్రసిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి, అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఆన్ లైన్లో ప్రసిద్దమైనవి లేక ఎక్కువగా సామాజికంగా ప్రసిద్దమైనవి ప్రభావంతమైన విషయాలను తెలుసుకోవడం అనేది ఔత్సాహికులకు, యువతకు ఉంటూ ఉంటుంది. ఎక్కువగా సోషల్ మీడియా ద్వరా ట్రెండుగా ఉండే అనేక అంశాలు ఉంటాయి. అలా సమాజంలో ట్రెండిగా ఉన్న విషయాలను అందించే అనేక న్యూస్ వెబ్ సైట్ల తోబాటు గూగుల్ ట్రెండ్స్ బాగా ప్రసిద్ది. ఈ రోజు దేశాలవారిగా గూగుల్ ట్రెండ్స్ కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Find Anything how to do in online

Wikihow వికీహౌ వెబ్ సైట్ పేరులాగానే ఏదైనా విషయం ఎలా చేయాలనే ప్రధానంగా చిత్రాలను చూపుతూ విధానం వివరిస్తూ ఆర్టికల్స్ ఉంటాయి. చిత్రం ఉండే సగం విషయం అర్ధం అవుతుంది, వివరణ కూడా ఉంటే సందేహం సమస్యే ఉండదు. How to do anything ? ఏదైనా సరే ఎలా చేయాలి అనే వివరణలు ఈ వెబ్ సైట్లో లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెబ్ సైట్ దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. మీరు మేజిక్ చేయాలనుకుంటున్నారా, మేజిక్ చేయడానికి సింపుల్ టిప్స్ కుడా చిత్రాలతో మీరు ఇక్కడ చూడవచ్చు. How to do majic ? పోస్టుని చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

న్యూస్ ట్రెండ్స్ అనేక అంశాలలో అప్డేట్స్ చూడాలంటే ఇండియాటైమ్స్ వెబ్ సైట్ దర్శిస్తే అన్ని అప్డేట్స్ ఉంటాయి. ఎకనామిక్స్, పాలిటిక్స్, మార్కెట్, ఇండస్ట్రీ, టెక్, జాబ్స్, ఏదేని అప్డేట్ ఇక్కడ వీక్షించవచ్చు. ఒక ఇంగ్లీషు పేపర్ వెబ్ పేజి అయితే ఎలా ఉంటుందో అలా ఇక్కడ న్యూస్ చదవవచ్చు. వెబ్ సైట్ దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ / క్లిక్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా 209వ అలెక్షా (Alexa)ర్యాంకు కలిగి ఉంది.


Blog things as web views

మీకు బ్లాగు ఉండి, బ్లాగుకి సరైన ట్రాఫిక్ లేదా అయితే బ్లాగుకి ట్రాఫిక్ ఎలా క్రియేట్ చేయాలి. బ్లాగుపోస్టులు వ్రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంటెంట్ మనజ్మేంట్ గురించి వివరించే బ్లాగులు అనేకం ఉంటాయి. అలగే బ్లాగు ఎలా సృష్టించాలి ? ఉచిత బ్లాగు ఎలా ఉపయోగించాలి సంభందిత విషయాలను తెలిపే వెబ్ సైట్లు అనేకం ఆన్ లైన్లో లభిస్తున్నాయి. ఎస్ఇఓ గురించి తెలిపే బ్లాగు గురించి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

WordPress famous website making materialized blog platform. Power full themse and plugin help ful to create a great blog. వర్డ్ ప్రెస్ ప్రసిద్ద బ్లాగులు / వెబ్ సైట్లు సృష్టించడంలో అనేక థీమ్స్ మరియు ప్లగ్ ఇన్స్ కలిగిన బ్లాగ్గింగ్ ప్లాట్ ఫారం. వర్డ్ ప్రెస్ వెబ్ సైట్లు సృష్టించడంలో మేజర్ వాటా కలిగి ఉంది. ఉచితంగా అయితే సులభంగా మెయిల్ ద్వారా వర్డ్ ప్రెస్ ఖాతా తెరిచి బ్లాగ్గింగ్ చేయవచ్చు. అయితే సదుపాయాలు పరిమితం. దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి. vegaweb పేజి చదవండి… తరువాయి పోస్టులలో…

ధన్యవాదాలు
vegawebviews