Blogger should needed increase traffic more

Blogger should needed increase traffic more

బ్లాగు విషయం అవసరమైనవారికీ చేరేలా చూసుకోవాలి.

బ్లాగు యొక్క విషయాలు, ఎవరికీ అవసరమో వారికీ చేరడమే బ్లాగు ప్రయోజనం అయితే, అలా చేరేల చూడడం కూడా బ్లాగర్ బాధ్యతే. ఎవరికీ ఏ విషయంపై సందేహాలు లేక సమస్యలు ఉంటే, గూగుల్ లేక ఇతర సెర్చ్ ఇంజిన్లలో వెతుకుతారు. వారికీ అవసరమైన వివరం లభించేవరకు వెతుకుతూ ఉంటారు. యూజర్ వెతికే విషయం, బ్లాగర్ సర్వర్లో చేర్చి ఉంచిన విషయం దరిదాపుగా సరిపొతే, సంభందిత బ్లాగులు టైటిల్స్ మరియు క్లుప్త వివరణలతో కూడిన లింకులు సెర్చ్ ఇంజిన్ యూజరుకి బ్రౌజర్లో చూపుతుంది.

SEO ప్రధానంగా రెండు రకాలుగా చెబుతారు. 1. ఆన్ పేజి ఎస్ఇఓ (on page Seo) 2. ఆఫ్ పేజి ఎస్ఇఓ (off page Seo). అంటే మొదటిది వెబ్ పేజి లేక బ్లాగు పేజి తయారు చేస్తున్నప్పుడే, సంభందిత మెటా టాగ్స్, హెడ్డింగ్స్, కీ వర్డ్స్, ఆల్ట్ టాగ్స్ తదితర విషయలు ఆధారంగా ఆర్టికల్ వ్రాయడం. ఇక రెండవది, ఆక్టివ్ లో ఉన్న వెబ్ పేజి లేక బ్లాగ్ పోస్టుని సోషల్ మీడియా వెబ్ సైట్లలో షేర్ చేయడం, పోస్టులకు లింక్ బిల్డింగ్ చేయడం, బ్లాగ్ సబ్మిషన్, యుఆర్ ఎల్ సబ్మిషన్, గెస్ట్ బ్లాగ్గింగ్ మొదలైన విషయలతో కూడి ఉంటుంది.

1. ఆన్ పేజి ఎస్ఇఓ (on page Seo).

టైటిల్: పేజి లేక పోస్ట్ టైటిల్ 50 అక్షరాలు(స్పేసులు కలిపి) మించి ఉండరాదు, అలాగే టైటిల్ 2 లేక 3 కీ వర్డ్స్ కలిగి ఉండి, ఆర్టికల్ వ్రాస్తున్నప్పుడు ఆ ఆర్టికల్ టైటిల్ ఆ ఆర్టికల్ లేక వెబ్ పేజిలో రెండు లేక మూడు సార్లు రిపీట్ అయ్యేలా చూడాలని SEO నిపుణులు చెబుతుంటారు. బ్లాగ్ పోస్ట్ టైటిల్ అయితే మాత్రం user friendly యుఆర్ఎల్ అయ్యి, ఎక్కువ పదాలు కలిగి ఉంటే, సెర్చ్ ఇంజిన్ క్యాచింగ్ విధానం బాగుంటుంది అని అంటారు.

మెటా డిస్క్రిప్సన్: వెబ్ పేజి లేక బ్లాగ్ పోస్టు యొక్క సంక్లిప్త వివరణగా చెబుతారు. అయితే వివరణ పొడవు 50 అక్షరాల నుండి ౩౦౦ అక్షరాల లోపు ఉండాలి అని అంటారు. మీరు వ్రాస్తున్న ఆర్టికల్ ప్రధాన విషయం చూపే పదాలతో సంక్లిప్త వివరణ నిర్మించడం వలన, సెర్చ్ ఇంజిన్స్ మీ ఆర్టికల్ని తొందరగా క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు.

యుఆర్ఎల్ స్ట్రక్చర్: అంటే, మీ బ్లాగ్ అడ్రస్ మాదిరి, మీరు వ్రాయబోయే పోస్ట్ యొక్క అడ్రస్ ని ఆ పోస్టు యొక్క యుఆర్ ఎల్ గా చెబుతారు. అయితే ఏ ఈ యుఆర్ఎల్స్ మీరు వ్రాస్తున్న ఆర్టికల్ టైటిల్ మరియు ఆ ఆర్టికల్లో ఉపయోగించబోయే కీవర్డ్స్ ను కలిగి ఉండేలా చూడమని చెబుతూ ఉంటారు.

ఆల్ట్ టాగ్స్: వెబ్ పేజి లేదా బ్లాగ్ పోస్టులో ఏవైనా చిత్రాలు జోడిస్తే, వాటికి టైటిల్ మరియు ఆల్ట్ ట్యాగ్ వ్రాయవలసిన అవసరం ఉంటుంది అని అంటారు. ఒక పోస్టుకి ఎలా అయితే యుఆర్ఎల్ కీ వర్డ్స్ తో కలిపి నిర్మిస్తామో అలాగే, ఇమేజుకి (బ్లాగులో లోకి అప్లోడ్ చేయకముందే ఆ చిత్రానికి లేక ఫోటోకి పెట్టేర్ పేరు) కూడా టైటిల్ మరియు ఆల్ట్ ట్యాగ్ వ్రాయడం వలన మీ యొక్క పోస్టుని సెర్చ్ ఇంజిన్ క్యాచ్ చేయడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి అని చెబుతారు.

హెడర్ టాగ్స్ : అంటే ఇవి మొత్తం ఆరు టాగ్స్ (h1,h2,h3,h4,h5,h6)ఉంటాయి. బ్లాగ్ పోస్ట్ లేక వెబ్ పేజి తయారీలో అవసరమైన చోట కంటెంట్ అర్ధవంతంగా ఉండేలా చూడడానికి ఈ హెడర్ టాగ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కూడా మీ ప్రధాన కీ వర్డ్స్ తో కలిపి ఉండేలా చూడాలి అని Seo నిపుణులు చెబుతారు.

ఇలా యూజర్ వెతికే విషయం, బ్లాగర్ సర్వర్లో చేర్చిన అంశాలను సరి చూడడానికి ఉపయోగపడేవి, కీ వర్డ్స్ (keywords). ఇవి చాల ప్రధానము, ఒక ఆర్టికల్ యొక్క వివరణ సారాంశం కీ వర్డ్స్ సహాయంతో యూజరుకి చేరుతుంది. బ్లాగ్ ట్రాఫిక్ పెంచడంలో సరి అయిన కంటెంట్ తో బాటు keywords మరియు description చాల కీలకమైనవి. మీ యొక్క బ్లాగు పేరు లేక డొమైన్ నేమ్, బ్లాగ్ కంటెంట్లో మీరు ఉపయోగించే ప్రధాన KEYWORD కలిగి ఉంటే, అది బ్లాగ్ ట్రాఫిక్ కు ఉపయోగం.

కంటెంట్ ఆప్టిమైజేషన్ : ఒక వెబ్ పేజి లేక బ్లాగ్ పోస్టు యొక్క టైటిల్, యుఆర్ఎల్, సంక్లిప్త వివరణ, హెడ్డింగ్ టాగ్స్, మెటా టాగ్స్, ఇమేజ్ ఆప్టిమైజేషన్ తదితర విషయాలలో జాగ్రత్తలు వహించడం . ముఖ్యంగా ఇంటర్నల్ లింక్స్ పెట్టడం ఒక పోస్టుకి మరొక పోస్టు యొక్క లింకులు, ఒకదానికి ఒకటి అదే వెబ్ సైట్ లేక బ్లాగులో

2. ఆఫ్ పేజి (off page) Seo

ఆన్ లైన్లో ఆక్టివ్ అయ్యి ఉన్న వెబ్ పేజి లేక బ్లాగు కంటెంట్ ఆర్టికల్ పోస్టులను ప్రోమోట్ చేసే విధానం, చాల ప్రధాన విషయం వెబ్ సైట్ లేక బ్లాగ్ ట్రాఫిక్ పెంచే విషయంలో. వీటిలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, గెస్ట్ బ్లాగ్గింగ్ సైట్లు, బ్లాగ్ సబ్మిషన్ సైట్లు, ఆర్టికల్ సబ్మిషన్ సైట్లు, డైరెక్టరి సబ్మిషన్ సైట్లు, సోషల్ బుక్ మార్కింగ్ సైట్లు, లింక్ బిల్డింగ్ సైట్లు, బిజినెస్ లిస్టింగ్ సైట్లు, ఫోరం మార్కెటింగ్ సైట్లు, ఇమేజ్ లేక వీడియో సబ్మిషన్ సైట్లు మొదలైనవి కలిపి అఫ్ పేజి ఎస్ఇఓ గా చెబుతారు.

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు: చాలామందికి పరిచయమై, ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న సోషల్ మీడియా వెబ్ సైట్లలో, వెబ్ పేజి లేక బ్లాగ్ పోస్టులు లింకులను షేర్ చేయడం. ఉదా: పేస్ బుక్, ట్విట్టర్, పిఇంటరెస్ట్, ఇన్స్టాగ్రాం మొదలైన వెబ్ సైట్లు.

గెస్ట్ బ్లాగ్గింగ్: ఇతర బ్లాగులలో అతిథిగా ఆర్టికల్స్ వ్రాయడం, దానితో పాటు మీ బ్లాగ్ యుఆర్ఎల్ షేర్ చేయడం, ఇంకా యూజర్ కామెంట్స్ కి సమాదానం ఇవ్వడం తదితర విషయాలను గెస్ట్ బ్లాగ్గింగ్ గా చెబుతారు. మీరు కూడా కావాలంటే మీ బ్లాగులో గెస్ట్ బ్లాగ్గింగ్ అవకాశం ఇతర బ్లాగర్లకి కల్పించవచ్చు.

బ్లాగ్ మరియు ఆర్టికల్ సబ్మిషన్: కొన్ని బ్లాగ్స్ లేక వెబ్ సైట్ల వివరాలు తెలియజేసే వెబ్ సైట్లు ఉంటాయి, అలంటి పాపులర్ వెబ్ సైట్లలో మీ బ్లాగ్ అడ్రస్ యుఆర్ఎల్ ఇతర వెబ్ సైట్లలో అప్డేట్ చేయడం, అలాగే ఆర్టికల్స్ సబ్మిట్ చేయడానికి కూడా ప్రత్యెక వెబ్ సైట్లు ఉంటాయి, వాటిలో కూడా మీ ఆర్టికల్ లింకులను అప్డేట్ చేయడం వలన బ్లాగు ట్రాఫిక్ పెరిగే అవకశాలు ఎక్కువ అని చెబుతారు.

లింకు బిల్డింగ్ వెబ్ పేజి లేక బ్లాగు పోస్టుల లింకులను కొన్ని వెబ్ సైట్లలో సబ్మిట్ చేయడం ద్వారా, అలాగే ఇతర బ్లాగుల లింకులు మీ వెబ్ సైట్ బ్లాగు పోస్టులలో షేర్ చేయడం వలన బ్లాగు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది.

ఫోరం మార్కెటింగ్ వివిధ రకాల అంశాలపై వివిధ ప్రశ్నలకు సమాధానాలు, సమస్యలకు పరిష్కారాలను కొంతమంది నిపుణులు ఏదైనా వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అటువంటి వెబ్ సైట్లను ఫోరం వెబ్ సైట్ అని అంటారు. అటువంటి వెబ్ సైట్లో కూడా బ్లాగు ప్రోమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

డైరెక్టరీ సబ్మిషన్: ఒక వెబ్ సైట్ లేక బ్లాగుని వివిధ రకాల కేటగిరీలలో బిజినెస్ డైరెక్టరీస్లో సబ్మిట్ చేస్తారు. అయితే మంచి PA DA రేటింగ్ బాగా ఉండేలా స్పాం లేకుండా చూడాలని అంటారు. ఇవి వెబ్ సైట్ ట్రాఫిక్ పెంచడంలో ఉపయోగం అంటారు. వెబ్ సైట్ నేమ్, లింకు నేమ్ మరియు సంక్లిప్త వివరణ మొదలైన వివరాలతో డైరెక్టరీ సబ్మిషన్ వెబ్ సైట్లో నమోదు చేస్తూ ఉంటే, రెగ్యులర్ వెబ్ సైట్ రాంక్ పెరిగే అవకాశాలు ఉంటాయి అని అంటారు.

ఇమేజ్ వీడియో సబ్మిషన్: కేవలం చిత్ర ప్రదర్శనలాగా ఉండే సోషల్ మీడియా వెబ్ సైట్లలో, బ్లాగు లేక వెబ్ పేజి కంటెంట్లో విషయానికి సంభందించిన చిత్రాలను షేర్ చేయడం కూడా బ్లాగ్ ట్రాఫిక్ పెంచుకునే పద్దతిలో ఒకటిగా చెబుతారు. అలాగే వీడియోలు కంటెంట్ విషయలపై వీడియోలు తయారుచేస్తూ, బ్లాగ్ పేరుతోనే యూట్యూబ్ ఛానల్ సృష్టించి, అందులో వీడియో అప్లోడ్ చేయడం వలన బ్లాగ్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువని చెబుతారు.

హోస్ట్ గేటార్ HOSTGATOR
డ్రీం హోస్ట్ DREAM HOST
A2హోస్టింగ్ A2HOSTING
బ్లూ హోస్టింగ్ BLUE HOSTING
ఇన్ మోషన్ హోస్టింగ్ INMOTION HOSTING
లేబెల్ హోస్టింగ్ LABEL HOSTING

ధన్యవాదాలు
vegawebviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *