Money Earning Chances Online, Freelancer – Telugu

Money Earning Chances Online, Freelancer – Telugu

ఫ్రీలాన్సర్ గా ఆన్ లైన్ అవకాశాలు – వెగ వెబ్ వ్యూస్

Money Earning Chances Online, Freelancer – Telugu ఇంతకుముందు పేజిలో ఇంటినుండే ఇంటర్నెట్ ద్వారా సంపాదన విషయాలపై వివరణ వ్రాయటం జరిగింది. అలంటి మార్గాలలో బ్లాగ్గింగ్ మరియు యూట్యూబ్ ఛానల్ వలన మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువ అంటూ ఉంటారు. అలాగే ఫ్రీలాన్సర్ గా కూడా సంపాదనా చేయవచ్చు. అయితే ఫ్రీ లాన్సర్ గా ఎదో ఒక ప్రత్యేకతలో నిపుణత అవసరం అని అంటారు. ఫ్రీలాన్సర్ అంటే పార్ట్ టైంలో ఒక పర్టిక్యులర్ పనిని పూర్తీ చేసి అప్పజెప్పడం ద్వారా ఆన్ లైన్లో డబ్బు సంపాదించవచ్చు. ఎదో ఒక కోర్సులో ఇతరులకు అవసరమైన పనులను మనం చేయగలిగి ఉండాలి, ఇతరులకు రాని పని అంటే, ఆ పనిలో ప్రత్యేక నిపుణత కలిగి ఉన్నవారికి సులభం అవుతుంది, ఈ విధంగా నిపుణులు ఆన్ లైన్లో ఫ్రీలాన్సర్ గా ధనార్జన చేయవచ్చు. వీరు ఇంటి నుండే ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్లో పనిచేసి డబ్బు సంపాదనా చేయవచ్చు.

ఫ్రీలాన్సర్ గా పనిచేయాలంటే ఏఏ పనులకు అవకాశాలు ఉంటాయి, ఎటువంటి కోర్సులు మనకి వచ్చి ఉంటే, ఆన్ లైన్లో ఇంటినుండే ఇన్ కం ఇంటర్నట్లో సాధ్యం చూద్దాం.
వెబ్ సైట్ డిజైన్, వెబ్ అప్లికేషను డెవలప్మెంట్, మొబైల్ అప్స్ డెవలప్మెంట్, ఈ మూడు ఆన్ లైన్ పనులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆన్ లైన్ అంటేనే ఆధారం వెబ్ సైట్ కాబట్టి, వెబ్ సైట్ డిజైన్ డెవలప్మెంట్ పనితో బాటు వెబ్ సైట్ మైంటైన్ చేసే వారు కచ్చితంగా మొబైల్ అప్ కూడా డెవలప్ చేయించుకోవాల్సిన డిమాండ్ స్మార్ట్ ఫోన్ల వినియోగం వలన పెరిగింది. వెబ్ మరియు మొబైల్ అప్స్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ రంగాలలో నిపుణత ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ జాబు అవకశాలు ఎక్కువ అని చెప్పవచ్చు.

ఇంకా ఫ్రీలాన్సర్ గా రాణించాలంటే, seo, సాఫ్ట్వేర్ డెవలపర్, ఏనిమేషన్, admin సపోర్ట్, నెట్ వర్కింగ్, కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, ఆర్టికల్స్ రైటింగ్. మార్కెట్టింగ్ , అకౌంటింగ్, లీగల్ ఇలా మొదలైన ప్రొఫెషనల్ వర్స్క్ కలిగి ఉంటే సంపాదించవచ్చు. వీటి వలన ప్రత్యక్ష ఉద్యోగాలలో కూడా రాణించవచ్చు, ఆన్ లైన్లో కూడా పార్ట్ జాబు వర్క్ గా చేయవచ్చు. ఏదైనా ఉద్యోగం చేస్తూ, మీకు మీ ఉద్యోగ సంభందమైన వృత్తిలో ప్రత్యెక నిపుణత ఉంటే, మీ కాళీ సమయంలో ఆన్ లైన్ ద్వారా ఇంటినుండే సంపాదన మార్గం సృష్టించుకోవచ్చు.

ఫ్రీలాన్సర్ గా ఏఏ వెబ్ సైట్ల ద్వారా పని చేయవచ్చు ? అంటే బాగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది అప్ వర్క్ ఫ్రీలాన్సర్ వెబ్ సైట్, ఇందులో అనేక వర్గాల వారిగా జాబ్స్ ఉంటాయి. అయితే మీరు జాబు ఎంచుకుని చేసే ముందు అప్ వర్క్ వెబ్ సైటులో మీయొక్క అర్హతలు, అనుభవం పీరియడ్ మొదలైన వివరాలతో రిజిస్టర్ కావాలి. ఫ్రీలాన్సర్ గా కూడా మొదట్లో కొంచెం సమయం పడుతుంది. మీరు కొన్ని వర్కులు పూర్తీ చేసి రేటింగ్ వస్తే, ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. ఈ విధంగా ఆన్ లైన్లో జాబు అవకాశాలు అందించే వెబ్ సైట్ల లింకులు క్రిందగా గమనించగలరు.

అప్ వర్క్ UPWORK
ఫివర్ర్ fiverr
ఫ్రీలాన్సర్ FREE LANCER
ట్రూలాన్సర్ TRUE LANCER

ఫ్రీలాన్సర్ వెబ్ సైట్లలో జాబు వర్క్ సెలెక్ట్ చేసుకునే ముందుగా , ఆ వర్కుని అందిస్తున్న సంస్థపై ఉన్న ఫీడ్ బ్యాకుతో కూడిన ప్రొఫైల్ చూడడం మంచిది, కొన్నిసార్లు వర్క్ ప్రొవైడర్ సరైన రెస్పాన్స్ ఉండకపోవచ్చు అలాగే పేమెంట్ నియమాలు చదవడం వలన రిస్క్ ఎంతవరకు ఉందో తెలుస్తుంది. వర్క్ ప్రొవైడర్ వర్క్ చేసే వారి ప్రొఫైల్ చూసుకునే వర్క్ చేయడానికి అనుమతి ఇస్తూ ఉంటారు, జాబు తీసుకునే వారు కూడా సంస్థపై ఉన్న ప్రొఫైల్ చెక్ చేసుకోవడమే ఉత్తమం అని అంటారు.

ధన్యవాదాలు

vegawebviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *